Begin typing your search above and press return to search.
మెలానియా ట్రంప్ విగ్రహాన్ని తగలబెట్టారు
By: Tupaki Desk | 9 July 2020 6:00 AM GMTఅమెరికా అధ్యక్షడు ట్రంప్ సతీమణి.. అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్ విగ్రహాన్ని ఆమె స్వస్థలమైన స్లోవేనియాలో ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ విగ్రహాన్ని ఇటీవల కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పుడు పెట్టిన వైనం తాజాగా బయటకు వచ్చింది. చెక్కతో నిర్మించిన ఈ విగ్రహాన్ని తగలబెట్టటంతో దాన్ని.. తొలగించారు. జులై నాలుగున అమెరికా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్న రోజునే.. చెక్కతో తయారైన ఆమె విగ్రహానికి నిప్పు పెట్టినట్లుగా విగ్రహాన్ని తయారు చేసిన కళాకారులు వెల్లడించాడు.
నిప్పు పెట్టిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే తాను పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు బ్రాడ్ డౌనీ పేర్కొన్నారు. మెలానియా విగ్రహానని ఎందుకు నిప్పు పెట్టారన్న విషయాన్ని తాను తెలుసుకోవాలని భావిస్తున్నట్లు అతడు పేర్కొన్నారు. ఈ ఉదంతం అమెరికాలో రాజకీయ చర్చకు తెర తీస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే.. వలసదారులపై ఉక్కుపాదం మోపిన ట్రంప్.. వలసదారు అయిన మెలానియాను పెళ్లి చేసుకోవటం తెలిసిందే.
మెలానియా ట్రంప్ విగ్రహాన్ని మాత్రమే కాదు.. డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని కూడా ఈ జనవరిలో దుండగులు దగ్థం చేశారు. చెక్కతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఉదంతం మరిచిపోకముందే.. ట్రంప్ సతీమణి విగ్రహాన్ని ధ్వంసం చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై మెలానియా ట్రంప్ కార్యాలయం ఇప్పటివరకూ స్పందించలేదు. ఈ ఉదంతంపై పోలీసుల విచారణ పూర్తి కాకపోవటంతోనే స్పందించనట్లుగా చెబుతున్నారు.