Begin typing your search above and press return to search.
డ్రెస్ రూ.25కే అంటూ ప్రకటన.. ఇంకేముంది జనం పరుగో పరుగు
By: Tupaki Desk | 25 Oct 2020 3:30 AM GMTఒక వైపు కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా నియంత్రణలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు.ఇక వైద్య సిబ్బంది అయితే తమ ప్రాణాలు పణంగా పెట్టి.. నిత్యం కరోనా పేషెంట్లు మధ్య ఉంటూ చికిత్సలు అందిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిత్యం జనం మధ్య తిరుగుతూ భౌతిక దూరం పాటించాలని, మాస్కు పెట్టుకోవాలని ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారు. కరోనా కట్టడి కోసం ఎన్ని పాట్లు పడతా ఉంటే కొందరు మాత్రం నిబంధనలు గాలికి వదిలి కరోనా వ్యాప్తికి కారకులు అవుతున్నారు. జనం కూడా మార్కెట్ల వద్ద, దుకాణాల వద్ద నిబంధనలు తోసుకుతిరుగుతున్నారు.
వ్యాపారులు అయితే బిజినెస్ జరిగితే చాలు కరోనా ప్రబలితే మాకేంటి అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. పండగ ఆఫర్లు, ప్రత్యేక ఆఫర్లు అంటూ జనాన్ని రప్పించుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రం సేలంలో కొత్తగా ప్రారంభమైన ఒక షాపింగ్ మాల్ భారీ ఆఫర్లను ప్రకటించింది. 20 నుంచి 25 రూపాయలకే డ్రెస్‌లు అంటూ వాడ వాడలా ప్రచారం చేసింది. దీంతో షాపింగ్ మాల్ దగ్గరికి జనం తండోపతండాలుగా వచ్చారు. కరోనా నిబంధనలను గాలికొదిలేశారు.గుంపులుగా నిలబడ్డారు. దీన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ బట్టల దుకాణాన్ని సీజ్ చేశారు. ఆ షాపు వద్ద జనాలు క్యూ కట్టిన వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా అవి వైరల్ గా మారాయి. కరోనా సోకి వేలాది మంది ప్రాణాలు పోతున్నా జనానికి బుద్ధి రావడం లేదంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.