Begin typing your search above and press return to search.

నేషనల్ మీడియా పీకేని పట్టించుకోవటంలేదా ?

By:  Tupaki Desk   |   3 May 2022 3:30 PM GMT
నేషనల్ మీడియా పీకేని  పట్టించుకోవటంలేదా ?
X
కొద్దిరోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ను నేషనల్ మీడియా అసలు పట్టించుకోవటంలేదట. కారణాలు స్పష్టంగా తెలీదుకానీ పీకే విషయమై నేషనల్ మీడియాలో పెద్దగా వార్తలు లేదా కథనాలు కనబడటంలేదు. రెండునెలలుగా పీకే గురించి జాతీయ మీడియా వదిలేసిందని తెలుగు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మాత్రమే కథనాలు కనిపిస్తోంది. ఈ మీడియా కూడా వాటి టీఆర్పీ రేటింగుల కోసమే పీకేను ప్రమోట్ చేస్తోందంతే.

ఆమధ్య పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నారా . చేరితే ఎలాగుంటుందని కొన్నిరోజులు, చేరితే టీఆర్ఎస్, జగన్మోహన్ రెడ్డి పరిస్ధితి ఏమిటంటు చర్చోపచర్చలు నిర్వహించాయి తెలుగు ఛానళ్ళు. యూట్యూబ్ ఛానెళ్ళయితే వాటి వ్యూస్ కోసం నానా రకాల కథనాలు అందించాయి. ఈ నేపధ్యంలోనే పార్టీలో ఒకచిన్న పదవి ఇస్తాము సామర్ధ్యాన్ని నిరూపించుకుంటే అప్పుడు చూద్దామని చెప్పి పొమ్మనలేక పొగపెట్టి మొత్తానికి పీకేని వదిలించుకున్నది.

విచిత్రం ఏమిటంటే ఇంకా పీకే గురించి తెలుగురాష్ట్రాల్లో మాత్రం మాట్లాడుకుంటునే ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్, జగన్ కోసం పీకే పనిచేస్తారని, అతను పనిచేస్తే ఆ పార్టీల్లో అద్భుతాలు జరుగుతాయని ఆ పార్టీలు అనుకుంటున్నాయి. కానీ పీకే మాత్రం ముందు తాను జనాల మనసు తెలుసుకుంటా, బీహార్ మనుషులతో మాట్లాడుతా అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మీదకూడా తెలుగు ఛానళ్ళు రకరకాలుగా చర్చలు, విశ్లేషణలు ఇస్తునే ఉన్నాయి.

కానీ నేషనల్ మీడియా మాత్రం పీకే వార్తలు రోజు మొత్తంమీద ఒక భాగమే అన్నట్లుగా ఉన్నారు. పీకేని నేషనల్ మీడియా పట్టించుకోకపోతే పీకేకి ఏదోలా ఉందని ఆ టీమ్ సభ్యులే అంటున్నారట. జాతీయస్ధాయిలో బీజేపీ లేదా కాంగ్రెస్ గురించి తప్పితే ఇంక దేనికీ నేషనల్ మీడియా ప్రిఫరెన్స్ ఇవ్వటంలేదని అర్ధమైపోయింది. అంటే పీకేని నేషనల్ మీడియా పూర్తిగా పక్కనపెట్టేసినట్లేనా ?