Begin typing your search above and press return to search.
పక్కా లోకల్ అంటున్న జగన్... బాబు తెలంగాణాకే
By: Tupaki Desk | 23 Dec 2022 5:30 PM GMTరాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సాగుతూంటాయి. వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా అమలవుతూ ఉంటాయి. లేకపోతే రాజకీయాలకు మజా ఎక్కడ ఉంటుంది. చంద్రబాబు ఏపీలో అధికారం కోసం తెలంగాణా నుంచి నరుక్కువద్దామని చూస్తున్నారు. మరి బాబు ఆశలు ప్లాన్స్ ఆయనవి. మరి దాన్ని చూస్తూ జగన్ ఊరుకుంటారా అంటే ఖమ్మం గుమ్మం దగ్గర బాబు ఆగారో లేదో ఇలా జగన్ బాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాబు ఇక తెలంగాణాకే. ఆయనకు ఏపీతో పని లేదు అంటూ కడప జిల్లా కమలాపురం బహిరంగ సభలో జనాలకు చెప్పేశారు. పైగా తాను పక్కా లోకల్ అంటూ గట్టి వివరణ ఇచ్చుకున్నారు. నేను ఉండేది ఇక్కడ నా నివాసం ఇక్కడ నా రాజకీయం ఇక్కడ, నా పార్టీ ఇక్కడ. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నా కుటుంబం ఏపీలోని అయిదు కోట్ల జనాలు. ఇంతే ఇదే నా రాజకీయ విధానం అంటూ జగన్ బాబు రెండు రాష్ట్రాల సిద్ధాంతానికి ఆదిలోనే అడ్డం తిప్పేశారు.
నాకు ఏపీ ముఖ్యం. ఏపీ జనాల సంక్షేమం ముఖ్యం. బాబు మాదిరిగా రాష్ట్రాలు పట్టుకుని తిరగను. ఏపీకే కట్టుబడి ఉంటాను. నా జీవితం అంతా ఏపీకే అంకితం అంటూ జగన్ సెంటిమెంట్ ని పండించే డైలాగులనే వదులుతున్నారు. నాకు ఒక్కటే రాష్ట్రం. ఒక్కటే రాజకీయం ఒక్కటే కుటుంబం అది ఏపీ ప్రజల కుటుంబం అంటూ జగన్ ఇంతలా విడమరచి చెప్పడం వెనక బాబునే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు అన్న మాట.
బాబుకు ఏపీ కావాలా తెలంగాణా కావాలా అన్నది తేల్చుకోమంటున్నారు అన్న మాట. పైగా బాబు అతి పెద్ద నివాసం హైదరాబాద్ లో కట్టుకున్నారు. ఆయన అక్కడ నుంచే వచ్చి ఏపీలో రాజకీయం చేస్తున్నారు. ఇంతకాలం బాబు పరాయి రాష్ట్రం నుంచి వస్తున్నారు అని మాత్రమే వైసీపీ నేతలు విమర్శలు చేసేవారు. ఇపుడు మాత్రం జగన్ దానికి మరింత మసాలా జోడించి ఆయనకు ఎన్నో రాష్ట్రాలు నాకు మాత్రం ఏపీ ఒక్కటే సుమా మీరే నాకు ముఖ్యం సుమా అంటూ ఏపీ జనాలకు చెబుతూ తనదైన శైలిలో రాజకీయం రక్తి కట్టిస్తున్నారు.
దాంతో ఇపుడిపుడే తెలంగాణాలో పట్టు కోసం ప్రయత్నం మొదలెట్టిన బాబు తనకు ఏపీ ముఖ్యమా తెలంగాణా ముఖ్యమా అని చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది అన్న మాట. పైగా నేను ఇక్కడే ఉంటాను నా నివాసం కేరాఫ్ అంతా ఇక్కడే అని జగన్ అంటున్నారు. మరి బాబు హైదరాబాద్ లో ఉండడం కూడా వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక పాయింట్ గా ఉండే చాన్స్ ఉంది అన్న మాట. అదే తీరున బాబు తెలంగాణా రాష్ట్రం కోసం కూడా పనిచేస్తాను అంటున్నారు.
దాంతో రేపటి రోజున రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడే సున్నితమైన అంశాలను కూడా బయటకు తీసి మరీ బాబుని ఇరకాటంలో పెట్టే ప్లాన్స్ ని కూడా వైసీపీ సిద్ధం చేసి ఉంచింది అని అంటున్నారు. మొత్తానికి నీవు ఒకటి అంటే నేను రెండు అంటాను అన్నట్లుగ బాబు జగన్ ల మధ్య రాజకీయ లడాయి సాగుతోంది. తెలంగాణాలో తన పార్టీని అభివృద్ధి చేసి తన పార్టీ గ్రాఫ్ పెరిగింది అని చూపించి బీజేపీకి దగ్గర కావాలని తద్వారా ఏపీలో పొత్తు పెట్టుకుని వైసీపీ మీద సమరం చేయాలని బాబు ఆలోచిస్తున్నారు.
దానికి ఇపుడు సరైన కౌంటర్ అన్నట్లుగా జగన్ నాది ఏపీ మీది ఏది అంటూ బాబుకే సూటి ప్రశ్న జనం మధ్య నుంచే వచ్చేలా చేస్తున్నారు అన్న మాట. బాబు రేపటి రోజు అయినా ఏపీకే ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీకే నా ఓటు చోటు అని బాబు అంటే తెలంగాణాలో పాలిటిక్స్ ఖతం అవుతుంది. మరి జగన్ వేసిన ఈ ప్లాన్ కి పడిపోవడానికి బాబు మాత్రం మామూలు లీడరా. చూడాలి మరి అటు నుంచి ఏ కౌంటర్ వస్తుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.