Begin typing your search above and press return to search.
జగన్ మీద అంత దారుణంగా బాబు..
By: Tupaki Desk | 25 Nov 2021 3:30 PM GMTచంద్రబాబు తాను ఎపుడూ బ్యాలన్స్ తప్పను అని చెప్పుకుంటారు. అయితే ఆ బాబు వేరు. ఇపుడు చూస్తున్న బాబు వేరు అన్న విశ్లేషణ కూడా ఉంది. చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓడాక కొంత మారారు. అయితే ఆయన అందరి నేతల మాదిరిగా తరచూ మాటలు తూలడం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయన కూడా గీతను దాటేస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది. తాజాగా రాయలసీమలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ మీద ఘాటైన విమర్శలే చేశారు. ఆయన చేతకాని సీఎం అయ్యారు, వృద్ధుడు అన్నారు. ఆయన ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం ఎలాగో తెలియదు అంటూ కామెంట్స్ చేశారు.
సరే ఇవన్నీపొలిటికల్ గా ఓకే అనుకున్నా వాటిని కూడా దాటుకుని సీఎం ఏరియల్ సర్వే మీద కూడా బాబు కామెంట్స్ చేశారు. గాలిలో వస్తాడు, గాలిలో ఎగురుతూ వెళ్ళి పోతాడు, చివరికి ఆ గాలిలోనే పోతాడు ఫినిష్ అవుతాడు అని బాబు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా బాబు మాటలు ఇంత దారుణంగా ఉన్నాయా అన్నదే చర్చ. దీని మీద వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా అయితే గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని గాల్లోనే పోతావ్ అనడమేంటి అని మండిపడ్డారు. సీఎం మీద ఎందుకింత అక్కసు అని ప్రశ్నించారు.
ఏ ముఖ్యమంత్రి అయినా ఏరియల్ సర్వే చేస్తారని, దాంట్లో తప్పేముంది అని ఆమె అంటున్నారు. ఇక చంద్రబాబు ప్రతిపక్ష నేతగా సలహాలు ఇవ్వాల్సింది పోయి ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడమేంటి ఆమె అన్నారు. నిజంగా ఇది బాధాకరమే. రాజకీయాల్లో ఎన్ని అయినా అనుకోవచ్చు. కానీ ఒక మనిషి లేకుండా పోవాలని కోరుకోవడమేంటి అన్న చర్చ వస్తోంది. బాబు జనాల వద్దకు వచ్చి జగన్ని ఓడించండి అని కోరడాన్ని ఎవరూ తప్పు పట్టారు, ఆయన లేకుండా ఉండాలని కోరుకోవడం అంటే దాని కంటే పరాకాష్ట వేరోకటి లేదు. దీని మీదనే రోజా లాంటి వారి కౌంటర్ ఏంటి అంటే జగన్ ఉండగా బాబుకు అధికారం కల్ల అని, అందుకే ఆయన ఇల తెగించి మాట్లాడుతున్నారని అంటున్నారు.
మొత్తానికి చంద్రబాబు పెద్ద మనిషి, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, ఆయన రాజకీయ కామెంట్స్ వర్తమాన తరానికి ఆదర్శంగా ఉండాలి, కానీ ఏడు పదుల వయసులో బాబు కూడా ఆవేశం తెచ్చుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక తమ్ముళ్లకు ఇచ్చే సందేశం ఏమి ఉంటుంది అని కూడా అంటున్నారు. ఇప్పటికే చినబాబు లోకేష్ జగన్ని పట్టుకుని గాలి గాడు అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. మనం విమర్శలు ఈ రకంగా చేసి ప్రత్యర్ధుల నుంచి మంచి గా మాటలు రావాలని కోరుకోవడం అంటే అత్యాశే కదా బాబులూ అంటున్నారు మేధవి వర్గాలు.