Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఆ ప‌ని చేస్తే పొలిటిక‌ల్‌గా ప్లాపేనా ?

By:  Tupaki Desk   |   26 Sep 2021 9:31 AM GMT
ప‌వ‌న్ ఆ ప‌ని చేస్తే పొలిటిక‌ల్‌గా ప్లాపేనా ?
X
అవును... ఇలా చేస్తే.. ప‌వ‌న్ ప‌రిస్థితి ఏంటి? ఇదీ ఇప్పుడు మేధావులు, రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఈ ఏడాది రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల‌ను (అవి స్థానిక‌, ప‌రిష‌త్‌) ప‌రిశీలిస్తే.. చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపించింది. ఎందుకంటే.. బీజేపీతో ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన పొత్తులో ఉంది. ఏడాది కాలంగా రెండు పార్టీలూ.. ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతున్నాయి. అంతేకాదు.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లోనూ రెండు పార్టీలూ క‌లిసి పోటీ చేశాయి. సో.. ఈ రెండు పార్టీల‌కూ పొత్తు కొన‌సాగుతోంద‌నే భావ‌న స‌ర్వ‌త్రా ఉంది. అయితే.. జ‌న‌సేన ప్ర‌మేయం ప్ర‌త్య‌క్షంగా ఉందో లేదో.. తెలియ‌దుకానీ.. జ‌న‌సేన‌తొ టీడీపీ స్థానికంలోనూ.. జ‌డ్పీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లోనూ పొత్తు పెట్టుకుంది.

ఈ క్ర‌మంలో కొన్ని చోట్ల ఈ రెండు పార్టీల పొత్తుకు ప్ర‌జ‌లు ఓకే చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆచంట వంటి మండ‌లాల్లో.. జ‌న‌సేన బ‌ల‌మైన ప‌క్షంగా.. టీడీపీకి మ‌ద్ద‌తిచ్చింది. ఈ క్ర‌మంలో ప‌ద‌వులు కూడా పంచుకున్నారు. ఇంత వ‌ర‌కు ఓకే! దీనిపై అటు.. ప‌వ‌న్ కానీ, ఇటు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కానీ.. ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. ఇదంతా.. లోపాయికారీగా తెర‌చాటు వ్య‌వ‌హారంగా క్షేత్ర‌స్థాయిలో నేత‌లే న‌డిపించేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు.. ఓ కీల‌క విష‌యం.. వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక ల నాటికి.. జ‌న‌సేన‌-టీడీపీలు పొత్తు పెట్టుకుంటే.. బాగుంటుంద‌ని.. ఇలా అయితే.. రాష్ట్రంలో అధికారంలో కి వ‌చ్చేందుకు ఈ రెండు పార్టీల‌కూ ఎడ్జ్ ఉంద‌ని ఓ వాద‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అంతేకాదు.. పొత్తు పెట్టుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యమ‌ని.. ఓ వ‌ర్గం మీడియా క‌థ‌నాలు రాస్తుంటే మ‌రో వ‌ర్గం కూడా ఇదే మంచిద‌ని.. వ్యాఖ్యానిస్తోంది. అయితే.. దీనిపైనా టీడీపీ అధినేత చంద్ర‌బాబు కానీ, జ‌న‌సేనాని ప‌వ‌న్ కానీ స్పందించ‌లేదు. అంతేకాదు..ఖండించ‌లేదు. సో.. దీనిని బ‌ట్టి.. పొత్తుకు ప్రాధాన్యం ఇచ్చి.. అంటే.. ఇప్పుడు స్థానికంలో వ‌చ్చిన ఫ‌లితాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అధికారం పంచుకునేందుకు రెడీ అయితే.. అంటే.. టీడీపీతో మ‌రోసారి పొత్తు పెట్టుకుంటే.. అది ప‌వ‌న్‌కు డ్యామేజీ కాదా ? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. 2014లో ఆయ‌న బాబుతో జ‌త‌క‌ట్టారు. బాగానే ఉంది.

కానీ, 2019లో ఎన్నిక‌ల‌కు వెళ్లేప్పుడు.. బాబుతో విభేదించారు. హోదా తేలేదని, పాచిపోయిన ల‌డ్డూలు తీసుకువ‌చ్చార‌ని.. చెప్పుకొచ్చారు. మ‌రి ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ప‌వ‌న్ వ్య‌క్తిగత పొలిటిక‌ల్ ఇమేజ్‌పై మ‌చ్చ‌లు ప‌డ‌వా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అలా కాదు.. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు.. అంటే.. ఇది అంద‌రూ.. అన్ని పార్టీలూ చెప్పే మాటే క‌నుక‌.. ఇక‌పై.. ప‌వ‌న్‌కు రాజ‌కీయ నీతులు చెప్పే చాన్స్ ఉండ‌క‌పోవ‌చ్చు! సో.. ఎటు చూసినా.. ప‌వ‌న్ విష‌యం ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు దారితీసింది.