Begin typing your search above and press return to search.
అజయ్ - సుదీప్ ట్విట్టర్ వార్ లో పొలిటికల్ ఎంట్రీ
By: Tupaki Desk | 28 April 2022 8:30 AM GMTబాలీవుడ్, శాండల్ వుడ్ హీరోల మధ్య మా భాష గొప్ప అంటే మా భాష గొప్ప అంటూ ట్విట్టర్ వారు మొదలైన విషయం తెలిసిందే. ఇది ఇప్పడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇటీవల కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇకపై హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదంటూ సంచలన కామెంట్ లు చేశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా కిచ్చా సుదీప్ వెల్లడించారు. సుదీప్ ట్వీట్ కు వెంటే రియాక్ట్ అయిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ రంగంలోకి దిగారు.
సుదీప్ మేరే భాయ్ అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. హిందీ జాతీయ భాష కాదంటే మీ సినిమాలను ప్రాంతీయ భాషలోనే కాకుండా హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు? అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి కిచ్చా సుదీప్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. మన దేశంలోని ప్రతీ భాషను నేను గౌరవిస్తాను. ప్రేమిస్తాను సార్. నేను ఆ మాటలను పూర్తి భిన్నమైన సందర్భంలో చెప్పాను. అది మీ దగ్గరకు వేరే రకంగా చేరింది. ఇది ఎవరినీ బాధపెట్టడానికో, రెచ్చగొట్టడానికో లేదా ఇలాంటి చర్చను ప్రారంభించడానికో కాదు. ఇక ఈ అంశం ఇక్కడితో ముగిసిపోవాలని కోరుకుంటున్నాను. మీరు హిందీలో పంపిన టెక్స్ట్ నాకు అర్థమైంది.
అందరం హిందీని గౌరవిస్తాం. కాబట్టి హిందీని ప్రేమించాము. నేర్చుకున్నాము. మరి నేను కన్నడలో టెక్స్ట్ చేసి వుంటే పరిస్థితి ఏంటా? అని ఆలోచిస్తున్నాను. మేము కూడా భారతదేశానికి చెందిన వాళ్లమే కదా సార్.
అనువాదం, వివరణలు, దృక్కోణాలు అసలు మేటర్ సార్. పూర్తి విషయం తెలియకుండా స్పందించకపోవడానికి కారణం అదే. దీనికి నేను మిమ్మల్ని నిందించను. ఒక సృజనాత్మక కారణంతో నేను మీ నుంచి ట్వీట్ ను స్వీకరించి వుంటే బహుషా అది సంతోషకరమైన క్షణం అయ్యేది` అంటూ అజయ్ దేవగన్ కి సుదీప్ సమాధానం చెప్పారు.
దీనికి అజయ్ కూడా రిప్లై ఇచ్చారు. హాయ్ కిచ్చా సుదీప్ మీరు నా స్నేహితుడు, అపార్థాన్ని తొలగించినందుకు ధన్యవాదాలు. నేను సినిమా ఇండస్ట్రీని ఒక్కటిగానే భావిస్తాను. మేము అన్ని భాషలను గౌరవిస్తాము. ప్రతీ ఒక్కరూ మన భాషను కూడా గౌరవించాలని మేము ఆశిస్తున్నాము. బహుశా అనువాదంలో ఏదో మిస్టేక్ జరిగింది` అంటే చెప్పుకొచ్చారు. ఇదిలా వుంటే ఈ ట్విట్టర్ వార్ రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఇద్దరి ట్విట్టర్ వార్ లోకి కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంటరయ్యారు.
హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదు. మన దేశంలోని భాషా వైవిద్యాన్ని గౌరవించడం ప్రతి బారతీయుడి కర్తవ్యం. ప్రతి భాషకు దాని ప్రజలు గర్వించదగ్గ గొప్ప చరిత్ర వుంది. నేను కన్నడీగ అయినందుకు గర్విస్తున్నాను` అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేసి అజయ్ దేవ్ గన్ కు ట్యాగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై అజయ్ దేవ్ గన్ ఎలాంటి రిప్లై ఇస్తాడో చూడాలి.