Begin typing your search above and press return to search.

అటు ఇటూ.. ఇటు అటూ.. గోవాలో మారుతున్న రాజకీయం..

By:  Tupaki Desk   |   26 Dec 2021 1:35 PM GMT
అటు ఇటూ.. ఇటు అటూ.. గోవాలో మారుతున్న రాజకీయం..
X
దేశంలో అతిచిన్న రాష్ట్రం గోవాలో రాజకీయ సమీకరణాలు కొత్త ధోరణలో వెళుతున్నాయి. త్వరలో ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఇతర పార్టీలు జోరు పెంచాయి. బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమలంకు ధీటుగా నిలవాలని తహతహలాడుతున్నాయి. ఇందులో భాగంగా బెంగాల్ కు చెందిన టీఎంసీ అధినేత మమతా బెనర్జీ గోవాలో ఇప్పటికే పర్యటలను చేశారు. ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను టీఎంసీలో చేర్చుకున్నారు. దీంతో గోవాలో టీఎంసీ ప్రాబల్యం పెరుగుతుందని అనుకున్నారు. కానీ ఇటీవల ఇక్కడి పరిస్థితులు మారుతున్నాయి. టీఎంసీలోకి వచ్చిన వారు తిరిగి ఆ పార్టీని వీడుతున్నారు.

గోవాలోని కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను టీఎంసీ ఆకర్షించింది. అయితే కాంగ్రెస్ ను వీడి టీఎంసీలోకి వచ్చిన వారంతా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లయిజిన్హొ ఫాలెరో మూడు నెలల కిందట టీఎంసీలో చేరారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే లావు మామ్లేదార్ కూడా కాంగ్రెస్ ను వీడారు. కానీ తాజాగా వీరు టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే లుయిజిన్హొ టీఎంసీ తరుపుర రాజ్యసభకు వెళ్లారు. కానీ తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక వీరితో పాటు రామ్ కిశోర్ పర్వార్, కోమల్ పర్వార్, సుజయ్ మాలిక్, మాండ్రేకరర్ వంటి నేతలు కూడా టీఎంసీకి రాజీనామా చేశారు. అయితే వీరు టఎంసీపై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం.

మమత మతతత్వ విధానాలను అమలు చేస్తున్నారని, టీఎంసీని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారని రాజీనామా చేసిన వారు తెలుపుతున్నారు. బీజేపీ కంటే టఎంసీ అధ్వానంగా ఉందని, ఆ పార్టీలో ఉండలేమని వారు విమర్శిస్తున్నారు. గోవాకు మంచి రోజులు వస్తాయనే ఆశతో టీఎంసీలో చేరాము. కానీ మమతా బెనర్జీ గోవా ప్రజలను అర్థం చేసుకోకుండా మతతత్వ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే టీఎంసీ నుంచి బయటకొస్తున్న నేతలకు ఇతర పార్టీలు ఆఫర్స్ చేస్తున్నాయి. మరోవైపు టీఎంసీలో చేరాలనుకున్నవారు ఆ పార్టీ వైపు వెళ్లడం లేదు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎక్కువగా టీఎంసీలో చేరారు.

తాజాగా గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత రవినాయక్ బీజేపీలో చేరారు.కాంగ్రెస్లోనీ మరో ముఖ్య నాయకుడు ప్రతాప్ సింహ రాణే త్వరలో బీజేపీలో చేరవచ్చని అంటున్నారు. అయితే గోవా బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ మహేంద్ర ఫడ్నవీస్ అసంతృప్తి నేతలను బీజేపీలో చేర్చుకునే యత్నంలో ఉన్నారు. అయితే ఎన్సీపీ తరుపున ఉన్న ఏకైక ఎమ్మెల్యే టీఎంసీలో చేరగా.. బీజేపీలోని అలీనా సల్దాన్హా ఆప్ లో, కార్లోస్ అల్మేడా కాంగ్రెస్లోకి మారారు. అయితే అంతకుముందు కంటే కొన్ని రోజులుగా గోవాలో జరుగుతున్న పరిణమాలు ఆసక్తిగా మారాయి.