Begin typing your search above and press return to search.
చవితి రాజకీయం: కేంద్రం పెట్టిన మంటేనా?
By: Tupaki Desk | 7 Sep 2021 1:30 PM GMTమరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా బొజ్జ గణపతి చవితి వేడుకలు జరగనున్నాయి. ప్రతి ఏటా.. ఈ వేడుకల ను యువత ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భారీ పందిళ్లు.. సందళ్లు.. ఎక్కడ చూసినా.. గణప తి బొప్పా మోరియా.. అనే నినాదాలు.. అదో పెద్ద సంబరం! అయితే.. గత ఏడాది కరోనా ఎఫెక్ట్ కారణంగా.. ఈ వేడుకలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఇక, ఇప్పుడైనా ఈ వేడుకలు నిర్వహించుకోవాలని అనుకున్నా.. పొంచి ఉన్న కరోనా థర్డ్ వేవ్.. ప్రభుత్వాలకు దడపుట్టిస్తోంది. దీంతో ఈ ఏడాది కూడా ఆంక్షలు కొనసాగించాలనేది ప్రభుత్వాల నిర్ణయం.
మరీ ముఖ్యంగా.. వ్యాక్సిన్ సహా కరోనా ఔషధాలు.. ఇతరత్రా ఆర్థిక సాయాలతో ఒకింత ఇబ్బంది పడుతు న్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం థర్డ్ వేవ్ వస్తే.. మరింతగా నష్టపోతామని భావిస్తోంది. ఈ క్రమంలో పలు వేడుకలపై నిషేధం విధిస్తోంది. ఈక్రమంలోనే వినాయకచవితి పైనా.. ఆంక్షలు విధించిం దనేది నిజం. ఇటీవల జరిగిన సమీక్షలో రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసిం ది. గుంపులుగా.. సమూహాలుగా నిర్వహించుకునే ఏ కార్యక్రమానికీ అనుమతి ఇవ్వొద్దని ఆదేశించింది. అంటే.. దీని అర్ధం.. వినాయక చవితిని దృష్టిలో పెట్టుకునే కదా?!
కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా.. పరోక్ష ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. కరోనా కేసులు పెరిగితే.. రాష్ట్రాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ పరిణా మాలతో ఏపీ ప్రభుత్వం వినాయక చవితిపై ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో వినాయక మండపాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పవని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటల మంటలు రాజుకున్నాయి.
వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే కరోనా నిబంధనలు అమలు చేయటంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చవితికి పందిళ్లు వేసుకొని ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతించాలన్న డిమాండ్ తో ఆందోళనలకు దిగింది. మరోవైపు గణపతి ఉత్సవాలు జోరుగా జరిగే.. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే.. మొత్తంగా చూస్తే.. చవితి వేడుకల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి.. రాష్ట్రాల్లో చిచ్చు పెడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఇదే విషయాన్ని ఏపీ మంత్రులు కూడా స్పష్టం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలతోనే తాము ఆంక్షలు విధించామని అంటున్నారు. మరి ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.