Begin typing your search above and press return to search.
వీధి పోరాటాలకు స్వస్తి.. టీఆర్ ఎస్-కాంగ్రెస్-బీజేపీ.. సభా సమరమే!
By: Tupaki Desk | 23 Sep 2021 5:24 AM GMTతెలంగాణలో ఇప్పటికే హీటెక్కిన రాజకీయాలు.. మరింత మసలనున్నాయా? ఇప్పటి వరకు వీధి పోరాటాలు.. ఒకరిపై ఒకరు ట్విట్టర్ యుద్ధాలు.. వ్యాఖ్యల మంటలు రాజేసుకున్న నాయకులకు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ.. మరో ప్రధాన పోరాట వేదిక కానుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు శుక్రవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఈసారి సమావేశాలు వారం రోజుల పాటు సాగే అవకాశముంది. వాస్తవానికి గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 15న ప్రారంభమై, 26వ తేదీతో ముగిశాయి. అప్పటి నుంచి ఆరు నెలల్లోగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అందుకే ఈ నెల 16న సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి... 24 నుంచి శాసన సభా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రభుత్వం ఓ రకంగా.. విపక్షాలు మరోరకంగా..
అసెంబ్లీ సమావేశాలు ఈసారి మరింత కాగనున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ సమావేశాలు 24న ప్రారంభమై, అక్టోబరు 1 వరకు కొనసాగే అవకాశముంది. దళిత బంధు పథకానికి కొత్త చట్టాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందనుంది. అయితే... బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత జరిగే చర్చ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో దళిత బంధు పథకంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. దళిత బంధు పథకం మాదిరిగానే గిరిజన బంధు, బీసీ, మైనారిటీ బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టాలంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రతిపక్షాల నేతలు గట్టిగానే వాదించే అవకాశముంది.
బిల్లుల కోసమే..
రాష్ట్రంలో హార్టికల్చర్, ఫారెస్ట్ కోర్సులను ప్రారంభించడానికి వీలుగా ‘కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ(అమెండ్‌మెంట్) బిల్లు-2021’ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డును వ్యాపార సంస్థగా పరిగణించకుండా... ‘హౌసింగ్ బోర్డు యాక్ట్-1956’లోని సెక్షన్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 25న ‘ది తెలంగాణ హౌసింగ్ బోర్డు(అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్-2021’ను తీసుకొచ్చింది. దీనిని బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి సవరణ చట్టాన్ని తీసుకురానుంది. పర్యాటక ప్రదేశాలకు సంబంధించి ఒక బిల్లు, ఇతర అంశాలపై మరో నాలుగు బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలిసింది.
రాజకీయ దుమారం ఖాయం!
ఇప్పుడు అసెంబ్లీ వేదిక.. రాజకీయ దుమారం సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఇటీవలే రేవంత్ చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేయడం..దీనిపై స్థానిక కోర్టు రూ.కోటి జరిమానా విధించడం.. వంటివాటిని కాంగ్రెస్ ఆయుధంగా చేసుకునే అవకాశం ఉంది. అదేసమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధను తీసుకువచ్చారని.. తరచుగా విమర్శిస్తున్న బీజేపీ దీనిని హైలట్ చేయనుంది. అదేసమయంలో కాంగ్రెస్, బీజేపీలు సంయుక్తంగా లేవనెత్తే మరికొన్ని అంశాలు కూడా అధికార పార్టీకి ఇబ్బంది పెట్టనున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశంఉంది. అయితే.. దీనికి దీటుగా అధికార పార్టీ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. సో.. ఎలా చూసినా.. ఈ సభ.. సమరాంగణాన్ని తలపించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.