Begin typing your search above and press return to search.
లోకేష్ పాదయాత్రలో లేని ఆ ప్లేస్ పొలిటికల్ గా సూపర్ హీటే హీట్
By: Tupaki Desk | 21 Jan 2023 3:30 AM GMTనారా లోకేష్ పాదయాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. లోకేష్ కుప్పం నుంచి మొదలెట్టి రాయలసీమ జిల్లాలను అన్నింటా కలియతిరుగుతారు. ఆ విధంగా రూట్ మ్యాప్ సెట్ చేసి పెట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు అనంతపురం, కర్నూల్, కడపల మీదుగా నెల్లూరు చేరుకునేలా పాదయాత్ర రూపకల్పన చేశారు.
ఇందులో చిత్తూరు, అనంతపురం, కర్నూల్ లోని అన్ని జిల్లాలను లోకేష్ పాదయాత్ర చేసేలా డిజైన్ చేశారు. చిత్రమేంటి అంటే కడపలో రెండు నియోజకవర్గాలు తప్ప మొత్తం అంతా లోకేష్ తిరుగుతారు. ఆ రెండింటిలో సీఎం జగన్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల ఉంది. అలాగే జమ్మలమడుగు ఉంది. ఈ రెండింటిలో లోకేష్ కాలు పెట్టరు.
మరి లోకేష్ జగన్ తో సవాల్ అని అంటున్న వేళ ఆయన సొంత సీటు పులివెందులలో కాలు పెట్టి అక్కడ జనాలతో మమైకం అయితే ఆ మజా వేరేగా ఉంటుంది కదా అని అంతా అంటున్నారు పైగా ఇలాంటి పొలిటికల్ మసాలాను చూడాలని అంతా ఉబలాటపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రైఉ వచ్చిన రెస్పాన్స్ కూడా రేపటి రాజకీయాన్ని మారుస్తుందని అంటున్నారు.
కానీ ఎందుకో మొత్తం డిజైన్ చేశారు కానీ పులివెందులను అలా వదిలేయడం పట్ల చర్చ అయితే గట్టిగా ఉంది. ఇక కోస్తా జిల్లాలను కలియచుట్టి ఉభయగోదవారిని దాటుకుంటూ ఉత్తరాంధ్రా దారులలో వెళ్తూ ఇచ్చాపురంలో పాదయాత్ర ముగించాలన్నది లోకేష్ ఆలోచన. ఈ టోటల్ పాదయాత్రకు నాలుగు వందల రోజులు టైం పడుతుందని లెక్క వేసుకున్నారు. అలాగే నాలుగు వేల కిలోమీటర్లు కూడా కొలుస్తూ లోకేష్ నడుస్తారు అని అంటున్నారు.
ఒక విధంగా యువనేత లోకేష్ కి ఇది మంచి అవకాశంగా చూస్తున్నారు. సోలోగా ఇంతవరకూ రాజకీయ రంగంలో లోకేష్ నిలవలేదు. కేరాఫ్ చంద్రబాబు అన్న ముద్ర ఆయనకు ఉంది. ఒక విధంగా లోకేష్ ఆలోచనలు ఏంటి అన్నవి కూడా జనాలు ఈ పాదయాత్ర ద్వారా తెలిసే అవకాశం ఉంది అంటున్నారు.
లోకేష్ నేరుగా జగన్ని ఢీ కొట్టాలని చూస్తున్నారు. దానికి ఇంతకంటే మంచి తరుణం వేరొకటి లేదు. జగన్ తో పోలిక పెడుతూ లోకేష్ ని పెంచుతారా తగ్గిస్తారా అన్నది వేరే మ్యాటర్ కానీ ఏపీని ఏలే సీఎం ని కాకుండా ఎవరి మీద ఫోకస్ చేస్తారు. సో డెఫినిట్ గా లోకేష్ జగన్ మీదనే బాణాలు ఎక్కుపెడతారు.
అందుకే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ లాంటి రాయలసీమ జిల్లాలను చుట్టేస్తూ పాదయాత్రను చేయడానికి సంకల్పించారు. కానీ పులివెందులను మాత్రం అలా వదిలేయడం బాగా లేదనే అంటున్నారు. మరి లోకేష్ కడప జిల్లా అంతటా తిరుగుతూ జగన్ని గట్టిగానే కౌంటర్ చేస్తారు కానీ పులివెందులలో పాదం మోపితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మరి ఆ విధంగా రేపటి రోజు అయినా మార్పు చేర్పులు చేస్తారా లేక అది అలా వదిలేసి ఆ సస్పెన్స్ అలా కంటిన్యూ చేస్తూ పోతారా అన్నది చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.