Begin typing your search above and press return to search.
ఇంట గెలవక రచ్చ పోటీచేస్తున్న అధినేతలు
By: Tupaki Desk | 23 March 2019 5:28 AM GMTపుట్టింది ఒక ఊరు.. పెరిగింది మరో ఊరు.. కానీ పోటీ చేస్తున్నది ఇంకో ఊరు.. ఇదే రాజకీయ నాయకుల ఆనవాయితీగా వస్తోంది. ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి పవన్ కళ్యాణ్ వరకు పార్టీ స్థాపించిన వారితో పాటు ప్రముఖులంతా తమ సొంత ఊరున్న నియోజకవర్గాల్లో కాకుండా కలిసొచ్చే నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేస్తున్నారు. ఈ కోవలోనే టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ - ఆ తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబునాయుడు - ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవితో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతుండడం విశేషం.
1983లో టీడీపీనీ స్థాపించిన ఎన్టీఆర్ ది కృష్ణజిల్లా నిమ్మకూర్ గ్రామం. ఈ గ్రామం గుడివాడ నియోజకవర్గంలో ఉంది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తరువాత గుడివాడ నుంచి 1983 - 85 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కుమారుడు బాలకృష్ణ సైతం 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందడం విశేషం.
ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె. చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. 1978లో కాంగ్రెస్ తరుపున ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఆయన టీడీపీలో చేరడంతో చంద్రగిరి నుంచి పోటీ చేయాలని ఎన్టీఆర్ కోరినా కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇది ఆయనకు తిరుగులేని నియోజకవర్గంగా మారింది.
2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి సొంతగ్రామం మొగల్తూరు. పాలకొల్లు నియోజకవర్గంలో ఉంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ నియోజవకర్గంలో పోటీ చేసేందుకు చిరంజీవి సుముఖత చూపలేదు. పాలకొల్లు - తిరుపతి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అయితే పాలకొల్లులో బెడిసికొట్టినా తిరుపతి నుంచి గట్టెక్కారు.
ఇక తాజాగా ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పాలకొల్లు అయినా.. అక్కడి నుంచి ఆయన పోటీ చేయడం లేదు. ఇదే జిల్లాలోని భీమవరం - విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కు ఎలా కలిసివస్తుందో చూడాలి
సొంత నియోజకవర్గాల్లో బంధు - బలగాలతో గెలపొందవచ్చని అనుకుంటారు. కానీ ప్రముఖులు మాత్రం తమ క్యేడర్ తోపాటు తమను ఆరాధించేవారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.. అంతేకాకుండా కొందరు సెంటిమెంట్‌ను కూడా ఫాలో అవుతున్నట్లు అనుకోవచ్చు. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలివాలని.. కానీ ఈ అధినేతలు ఇంట భయపడి రచ్చ గెలుస్తున్నారు.