Begin typing your search above and press return to search.

కోపంతో బాలుడి ముక్కు కొరికిన పొలిటికల్ లీడర్

By:  Tupaki Desk   |   8 Aug 2022 3:30 PM GMT
కోపంతో బాలుడి ముక్కు కొరికిన పొలిటికల్ లీడర్
X
దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన నేతలు గాడితప్పుతున్నారు. ఒక్కోసారి వారు చేసే పనులు నవ్వుల పాలవుతుంటాయి. ఓ రాజకీయ నాయకుడు కోపంతో తమ ఇంట్లో పనిచేసే 16 ఏళ్ల బాలుడి ముక్కును కొరికేశాడు.

అతడికి ఏం వెర్రినో తెలియదు కానీ.. ఇలా బాలుడి ముక్కుకు తీవ్ర రక్తస్రావమై ఇప్పుడు విషమంగా మారింది. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది.

ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పుర్ లో సోమవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అభయ్ నామ్ దేవ్ అనే బాలుడు.. సచిన్ సాహూ అనే రాజకీయ నాయకుడి ఇంట్లో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం బాలుడు చిన్న తప్పు చేశాడని కోపంతో రగిలిపోయిన సాహూ అతడి ముక్కు కొరికేశాడు.

తీవ్ర రక్తస్రామమైన బాలుడిని శనివారం రాత్రి స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఝాన్సీ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు.

బాధితుడి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం వల్ల చర్యలు తీసుకోలేదని పోలీస్ వర్గాలు తెలిపాయి. రాజకీయ నాయకుడు డబ్బులిచ్చి దీన్ని మెయింటేన్ చేసినట్టుగా తెలుస్తోంది.

రాజకీయ నాయకుల చేష్టలు గందరగోళంగా ఉంటున్నాయి. వారికి కోపం కంట్రోల్ చేసుకోవడం కానకష్టంగా ఉంటుంది. అలాంటి టైంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటాయని తెలుస్తోంది.

ఇలా క్షణికావేశంలో బాలుడి ముక్కు కొరికిన ఈ రాజకీయ నేత తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. నీకు అలాంటి ముక్కు లేకుండా చేస్తే తగిన శాస్తి జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.