Begin typing your search above and press return to search.
వ్యూహాలోకంలో రాజకీయం : పార్టీలకు కర్త కర్మ ఖర్మ....?
By: Tupaki Desk | 8 Jun 2022 10:48 AM GMTవ్యూహాలు అన్నవి ప్రతీ బుర్రలో ఉంటాయి. గట్టిగా ఆలోచించాలి కానీ మెదడుకు తట్టని ఆలోచనలు ఉండవు. ఇక ఒక వాతావరణానికి సరిపడే ఆలోచనలు అక్కడే పుడతాయి. వాటి విజయం కూడా అలాగే సాధ్యపడుతుంది. అయితే తమది కానిది తమ వద్దలేనిదీ వేరే చోట ఉందని భ్రమిస్తూ వూహాలోకంలో విహరిస్తూ ఇపుడు భారత దేశాన రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నాయి. ఈ విషయంలో అపరచాణుక్యులు అయినా మామూలు నాయకులు అయినా ఒక్కటే అన్న చందంగా వ్యూహకర్తల కోసం అర్రులు చాస్తున్నారు.
నిజానికి వ్యూహాలు పండాలి అంటే తగిన వాతావరణం ఉండాలి కానీ ఆర్టిఫీషియల్ వ్యూహకర్తలు చూపించే మ్యాజిక్కులు. కలర్ ఫుల్ గా చెప్పే విషయాలకు దేశంలోని తల నెరసిన నేతాశ్రీలు పడిపోతున్నారు. ఫలితంగా వ్యూహకర్తలకు యమ డిమాండ్ వచ్చేస్తోంది. వారు కూడా రాజకీయాల చుట్టూ రాజకీయ నేతల చుట్టూ తిరుగుతూ అతి పెద్ద బిజినెస్ గా దీన్ని మార్చేస్తున్నారు.
ఐఐటీలలో చదువుకుని ఉన్నత ఆశయాలతో ఉద్యోగాలు చేస్తూ దేశ ప్రగతికి ఆర్ధిక అభివృద్ధికి ఉపయోగపడాల్సిన వారు వ్యూహకర్తల అవతారం ఎత్తుతున్నారు. కొన్నాళ్ళకు తొండ ముదిరి ఊసరవెల్లిగా మారింది అన్న చందాన వారు కాస్తా రాజకీయ నాయకుల వేషాలు మార్చేసి పార్టీలను కూడా పెట్టేస్తున్నారు. ఇలా రాజకీయాలను తారు మారు చేస్తూ ట్రెడిషనల్ పాలిటిక్స్ కి గండి కొడుతూ సరికొత్త ట్రెండ్ అంటూ వర్తమాన రాజకీయాన్ని గబ్బు పుట్టిస్తున్నారు అన్న విమర్శలు అయితే అంతటా వినిపిస్తున్నాయి.
చాలా చోట్ల చూస్తే కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం వ్యూహకర్తలు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే స్ట్రాటజీలకు తెర తీస్తున్నారు. ఇక ఓట్లు రావాలీ అంటే ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ విలువలకు తిలోదకాలు వదిలేస్తున్నారు. ఓట్ల కోసం తాము అగ్రిమెంట్ కుదుర్చుకున్న ప్యాకీజి కోసం ఆర్ధిక పరిస్థితులను కూడా విస్మరిస్తూ ఖజానాను దివాళా తీయించే హామీలు కూడా ఇప్పించేస్తున్నారు.
రాష్ట్రం ఏమైపోతేనేమి, ఆల్ ఫ్రీ అని చెబుతూ ఉచిత హామీలు ఇస్తూ తాము డీల్ కుదుర్చుకున్న రాజకీయ పార్టీ నెగ్గిందా లేదా అన్నదే ఇపుడు వ్యూహకర్తల విధానంగా ఉంది అని చెప్పాలి. మరో వైపు చూస్తే సామాజిక మాధ్యమాలను విచ్చలవిడిగా వాడుకుంటూ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తూ తప్పుడు పోస్టింగులతో కొందరు సామాజిక ఉద్రిక్తతలకు కూడా దారి తీసేల వ్యూహాలు చేస్తున్నారు.
అంతే కాదు శీల హననానికి కూడా పాలుపడుతున్నారు. సంప్రదాయ రాజకీయాల్లో పెద్దల పట్ల గౌరవం ఉండేది, మహిళల పట్ల మర్యాద ఉండేది, కానీ వ్యూహకర్తల ట్రెండ్ లో ఎవరైతే మనకేంటి నాలుగు ఓట్లు రావాలంటే ఏమైనా చేయవచ్చు అంటే అదే చేసేస్తున్నారు. దాని ఫలితంగా సామాజిక అశాంతి పెరిగిపోతోంది మర్యాద మంటగలుస్తోంది.
మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారు. ఇక వచ్చిన వారు కూడా కొత్త ట్రెండ్ కి అనుగుణంగా ఉండాల్సి వస్తోంది. అలాగే పెద్ద వయసు వారి నోట, పెద్ద మనుషుల మాట కూడా చాలా తేడా వచ్చేస్తోంది. అనుచిత సంభాషణ వర్తమాన రాజకీయాలొలో ఒక కళ అయిపోయింది, జనాల ఫోకస్ ఎపుడూ తమ వైపు ఉండాలంటే ఎపుడూ వివాదాలను ఎక్స్ పోజ్ చేయాలీ అన్న దమన నీతిని కూడా అమలు చేస్తున్నారు.
కోట్లాది రూపాయలు ఇచ్చి మరీ తెచ్చి పెట్టుకుంటున్న వ్యూహకర్తల రాజకీయం మూలంగా అసలు నాయకులు పార్టీలు తమను తాము మరచిపోతున్నారు. తమ ఉనికినీ అస్థిత్వాన్ని కూడా కోల్పోతున్నారు. చివరికి కధ ఎలా తయారైంది అంటే వ్యూహకర్తల రాజకీయాలతో కాకరకాయ కాస్తా కీకరకాయ అవుతోంది.
ఏది ఏమైనా రాజకీయాల్లో అవాంచనీయ పరిణామాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి అంటే అరువు తెచ్చుకున్న వ్యూహాల మూలంగానే అని చెప్పాల్సి వస్తోంది అదే విధంగా కుల మతాల మధ్య సామాజిక చిచ్చు పెట్టడం కూడా మంచి పరిణామం కాదు, రాజకీయం కోసం అధికారం కోసం ఆర్ధిక వ్యవస్థకు గండి కొట్టడం కూడా అంతకంటే మంచిది కాదు. కానీ ఇపుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. నాయకులను ఊహాలోకంలో తిప్పేస్తుంది.
తమలో ఎంత టాలెంట్ ఉన్నా అధినాయకుడు వ్యూహకర్తలు ఇచ్చిన సర్వేలనే నమ్ముకుని సీటు ఇవ్వడంలేదని వాపోయే బాపతు చాలానే ఉంది. అలాగే నాయకుడికీ అనుచరులకు మధ్య ఉన్న అందమైన బంధం కూడా తెగిపోతోంది. మితిమీరిపోతున్న ఈ జోక్యం తగ్గాలే అంటే వ్యూహకర్తల రాజకీయానికి చెక్ చెప్పాల్సి ఉంటుంది.
రాహుల్ గాంధీ లాంటి నాయకుడు అయితే మాకు వద్దు ఎవరి వ్యూహాలు కాంగ్రెస్ కి తెలుసు ఎలా జనంలోకి పోవాలో. ఎలా అధికారంలోకి రావాలో అంటూ సున్నితంగానే తిరస్కరించి వ్యూహకర్తల భ్రమలకు తెర దించేశారు. ఇదే ఇపుడు ఇతర పార్టీలకు స్పూర్తి కావలి. అపుడే సొంత బుర్ర పనిచేస్తుంది. ఎంతో కొంత పూర్వపు రాజకీయ వాతావరణం పాదుకొలిపే అవకాశం ఉంటుంది.