Begin typing your search above and press return to search.
విశాఖ పీఠం.. వారసుల ఆరాటం
By: Tupaki Desk | 2 April 2016 9:18 AM GMTకేంద్ర మంత్రి - సీనియర్ బీజేపీ నేత వెంకయ్య నాయుడు రాజకీయాల్లో తన వారసులను తెచ్చేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. కుమార్తె దీపావెంకట్ ను తన వారసురాలిగా రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. విశాఖ పట్నం వేదికగా దీపాను రాజకీయాల్లో తేవడానికి తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు. త్వరలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశాఖ మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు దీపాను రెడీ చేస్తున్నారు. నవ్యాంధ్రలో అతిపెద్దది... అత్యంత కాస్ల్టీ నగరమైన విశాఖలో అధికారం చేతిలో ఉంటే తిరుగుండదని... అంతేకాకుండా విశాఖ మేయర్ గా మొదలుపెట్టి ఆ తరువాత విశాఖ ఎంపీగా కూడా దీపాను గెలిపించుకోవచ్చన్నది ఆయన ప్లానుగా తెలుస్తోంది. వెంకయ్య ఆలోచనలను పసిగట్టిన స్థానిక టీడీపీ - బీజేపీ నేతలు మాత్రం కంగారుపడుతున్నారు. ఎందుకంటే అక్కడి నేతలు కూడా తమతమ వారసులను రంగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంకయ్యే ఇప్పుడు రంగంలోకి దిగితే తమకు చాన్సు పోతుందన్నది వారి భయం.
చంద్రబాబుతో వెంకయ్యనాయుడుకు ఉన్న సంబంధాల నేపథ్యంలో వెంకయ్య ప్లాను వర్కవుట్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే... వెంకయ్య కూడా నేరుగా ఎన్నికల నాటికి అక్కడ దిగకుండా ముందే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే దీపావెంకట్ విశాఖ పరిధిలోని రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు.
కాగా విశాఖ నేతలు కూడా తమతమ వారసులను విశాఖ మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు తన కుమారుడు రవితేజను మేయర్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇటీవలే మంత్రి నారాయణ కుమార్తెను వివాహం చేసుకున్న రవితేజకు అటునుంచి కూడా మద్దతు ఉంది. కాగా విశాఖకు చెందిన మరో నేత - భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా తన కుమార్తె శ్యామలను విశాఖ మేయర్ చేయాలని పావులు కదుపుతున్నారు. కానీ... వెంకయ్య ఇప్పుడు రంగంలోకి దిగేసరికి వీరి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది. వెంకయ్యకు ఉన్న రాజకీయ సంబంధాలు... చంద్రబాబు ఆయనకు ఇచ్చే ప్రయారిటీ... చంద్రబాబుకు ఆయన అవసరం వంటివన్నీ లెక్కేసుకుంటే వెంకయ్య రాజకీయమే నిలబడుతుందని తెలుస్తోంది. ఆ లెక్కన దీపావెంకట్ విశాఖ మేయర్ కావడం ఖాయమని అనుకుంటున్నారు.