Begin typing your search above and press return to search.
నేతలకు రూ.2వేల నోటు వణుకు
By: Tupaki Desk | 13 Nov 2016 2:01 PM GMTవెయ్యి నోటు రంగ ప్రవేశం చేశాక రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాజకీయాల్ని శాసించే ఎన్నికల్లో వెయ్యి నోటు కీలకంగా మారింది. ఓటుకు రేటుతో కొలిచే నేతలు గతంలో ఇచ్చే మొత్తం రూ.500.. రూ.వెయ్యి నోట్ల రంగప్రవేశంతో మరింత ఖరీదెక్కాయి. గతంలో ఎమ్మెల్యే పదవి కోసం మూడు.. నాలుగు కోట్లను ఖర్చు చేయటానికే కిందామీదా పడిపోయే నేతలంతా.. గత సార్వత్రిక ఎన్నికల్లో పది.. పదిహేను కోట్లను అలవోకగా ఖర్చుచేయటాన్ని మర్చిపోకూడదు.
ఈ ఖర్చుకు తగ్గట్లే ఓటర్లకు రూ.500 స్థానే.. వెయ్యి రూపాయిల నోటును బహుమతిగా ఇవ్వటం ఒక అలవాటుగా మారింది. తాజాగా వెయ్యి రూపాయిల నోటును రద్దు చేస్తూ.. దానిస్థానే కొత్త రూ.2వేల నోటును తెర మీదకు తీసుకొచ్చిన వేళ.. నేతలకు కొత్త గుబులు పట్టుకుంది. ఇంతకాలం పెద్ద నోటుగా ఉన్న వెయ్యిని ఓటుకు నోటుకు కింద డిసైడ్ చేశారు.
గతంలో అంటే.. బ్లాక్ మనీ కుప్పలు కుప్పలుగా ఉండే పరిస్థితి. తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులతో బ్లాక్ మనీ మొత్తం ఊడ్చుకుపోయే పరిస్థితి. ఎవరైనా తెలివిగా.. బ్లాక్ ను వైట్ గా చేసుకునే ప్రయత్నం చేసినా దానికి సవాలచ్చ లెక్కలతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని దుస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా తెరపైకి వచ్చిన రూ.2వేల నోటుతో కొత్త సమస్యలు తప్పవని చెబుతున్నారు.
త్వరలో యూపీతో సహా కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటు రేటు కానీ రూ.2వేల నోటుకు ఫిక్స్ అయితే నేతలకు చుక్కలు కనిపించటం ఖాయమంటున్నారు. రూ.2వేల నోటుతో పెరిగే బడ్జెట్ తో ఎన్నికల బరిలో నిలిచే వారికి తీవ్ర ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా రూ.2వేల నోటుతో సంపన్నులైన రాజకీయ నేతలకు తప్పించి.. డబ్బు లేని నేతలకు ఎన్నికల్లో నిలవటం కష్టంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/