Begin typing your search above and press return to search.
ఏపీ ఎన్నికలు..దెబ్బకు ఆ నేతల బతుకు బస్టాండే..!
By: Tupaki Desk | 17 May 2019 12:53 PM GMTఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. అధికార - ప్రతిపక్షాల ఎత్తుకు పై ఎత్తులు - వ్యూహాత్మక అడుగులతకు తోడు జోరుగా సాగిన వలసలతో ఈ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. ఈ సారి విజయంపై తెలుగుదేశం పార్టీ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నేయడంతో సార్వత్రిక ఎన్నికలు రంజుగా ముగిశాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాలకు చాలా సమయం ఉండడంతో ఎక్కడ చూసినా వీటి గురించే మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ఈ క్రమంలో పలు సర్వేలు తెర పైకి వస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి నోట విన్నా సర్వేల మాటే. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న విశ్లేషణలే. ఏది నిజం.. ఏది అబద్ధమనే విషయాన్ని పక్కన పెట్టి మరీ - తమ అభిమాన నేతే గెలుస్తున్నారు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల్లో అభ్యర్థుల పెట్టిన ఖర్చుల గురించి సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆయా పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులు విజయం కోసం డబ్బులను వెదజల్లారు. అభ్యర్థిత్వం ఖరారు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాల నుంచి పోలింగ్ ముగిసే వరకు పెట్టిన ఖర్చులు చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులు ‘‘అందరికీ నువ్వు భోజనం పెట్టావా.. నేను బిర్యానీ పెడతా.. తాగడానికి నువ్వు క్వార్టర్ ఇచ్చావా.. నేను ఆఫ్ ఇస్తా.. నువ్వు 50 మందిని ప్రచారానికి పిలిచావా.. నేను 150 మందిని పిలుస్తా’’ అన్నట్లు వ్యవహరించారు.
అంతేకాదు - మునుపెన్నడూ లేని విధంగా అధికార పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచార సభలకు - రోడ్ షోలకు ర్యాలీలకు జనసమీకరణను అధికంగానే ఖర్చు చేశారట. జీతమిస్తేనే కానీ రాని పరిస్థితుల్లో కోట్లాది రూపాయలు జన సమీకరణకు ఖర్చు పెట్టారు. సభలు - రోడ్ షోలు - ర్యాలీలకే ఒక్కొక్కరు సుమారు రూ. 25 కోట్లు ఖర్చు చేసి ఉంటారని ఒక అంచనా. సభలకు రూ. 300 నుంచి రూ. 500లు కూలి ఇచ్చి మరీ జనాలను తెచ్చారన్న టాక్ ఉంది. ర్యాలీలో బైక్ లకు పెట్రోలు కూపన్లు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిసింది. తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఖర్చులు చూస్తే వాళ్లకు దిమ్మతిరిగిపోయిందట. గెలుస్తామన్న ధీమాతో ఖర్చు చేసిన అభ్యర్థులు ఓడిపోతే తమ బతుకు బస్టాండే అని తెగ టెన్షన్ పడిపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.