Begin typing your search above and press return to search.
ఈ గట్టుకొస్తారా...ఆ గట్టునుంటారా...!?
By: Tupaki Desk | 5 Sep 2018 4:39 AM GMTతెలంగాణలో ముందస్తు రంగం సిద్ధం అయ్యింది. అంటే వలసలకు కూడా రంగం సిద్ధమైనట్లే. ఈ గట్టున ఉన్న వారు ఆ గట్టుకు... ఆ గట్టున ఉన్న వారు ఈ గట్టుకు వెళ్లేందుకు రాజకీయ నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. దీనికి నాందీ వాచకం సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడమేనని అంటున్నారు. తెలంగాణలో ముందస్తుకు గురువారం మూహుర్తం నిర్ణయం కాబోతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గురువారం ఆరో తేదిన తెలంగాణ శాసనసభను రద్దు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక రెండో ఘట్టం పలు పార్టీలకు చెందిన నాయకులు ఆయా పార్టీలు మారి మరో పార్టీలోకి మారడమే. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొందరు నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు.
మరో రెండు రోజుల్లో బాహుబలి రానున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. అయితే ఈ బాహుబలి ఎవరో ఇంకా తేలలేదు. బహుశా శాసనసభ రద్దు ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కీలక నాయకుడొకరు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయలు కారు ఎక్కబోతున్నాయని ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితి తీర్ధం పుచ్చుకున్న దానం నాగేందర్ అన్నారు. ఈ పెద్ద నాయకులు ఎవరో కూడా ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ - తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకే ఎక్కువ చేరికలు ఉంటాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితితో చేతులు కలిపిందని ప్రజల్లో బలంగా ఉండడంతో బీజేపి నుంచి ఎవ్వరూ అధికార పార్టీలో చేరే అవకాశం లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటే అక్కడి నుంచి కూడా ఎవ్వరూ పార్టీ మారే అవకాశం లేదు. ఇక చిన్నా - చితకా నాయకుల మాత్రం ఈ గట్టు నుంచి ఆ గట్టుకు... ఆ గట్టు నుంచి ఈ గట్టుకు మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.