Begin typing your search above and press return to search.

అప్పుతో పబ్బం గడిపి కష్టాలో ఊబిలో పడిన ఎమ్మెల్యేలు .. ఇంతకీ ఆ కథ ఏంటి ?

By:  Tupaki Desk   |   4 Dec 2019 5:15 PM GMT
అప్పుతో పబ్బం గడిపి కష్టాలో ఊబిలో పడిన ఎమ్మెల్యేలు .. ఇంతకీ ఆ కథ ఏంటి ?
X
సాధారణంగా ఎన్నికలు అంటే కోట్లతో వ్యాపారం అనేది అందరికి తెలిసింది. నామినేషన్స్ వేసే రోజు నుండి ఎన్నికల ఫలితాల వచ్చే వరకు ఒకటే ఖర్చు. కానీ , చివరికి మాత్రం ఆ ఎన్నికలలో ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు. ఆ ఎన్నికలలో గెలిచిన వారికీ ఐదేళ్ల పాటు ఇక తిరుగుండదు. అందుకే ఆ పదవి కోసం రాజకీయ నాయకులు తమ సర్వశక్తులు ఓడ్డి పోరాటం చేస్తారు. ఓట్ల కోసం నీళ్లలా డబ్బులు ఖర్చు చేస్తారు. ఆలా ఓట్ల కోసం చేసిన ఖర్చే ఇప్పుడు కొంతమందికి గుదిబండలా తయారైందట.

ఎన్నికలల్లో గెలిచేది మనమే అని , అతి విశ్వాసం తో కోట్లని నీళ్లలా ఖర్చు పెట్టారు. ఆలా ఎన్నికల ఖర్చుకు తమ ఆస్తులని బ్యాంకు లో తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చి ఇష్టానుసారంగా ఖర్చుపెట్టేశారంట ..ఇప్పుడు ఆ బ్యాంకు వాళ్లు వచ్చి ఇంట్లో కూర్చోవడం తో ఏమి చేయాలో తెలియక ఆలోచన లో పడ్డారట ఆదిలాబాద్‌ జిల్లాలోని కొందరు నేతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది సమీపిస్తున్నా, ఎన్నికల సంక్షోభం నుంచి నాయకులు మాత్రం బయటపడటం లేదని తెలుస్తోంది.

ఎలక్షన్స్‌లో టిఆర్ఎస్‌, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడ్డారు. కొందరు జీవితకాలంలో ఎమ్మెల్యేగా గెలవడం చిరకాల వాంచగా పెట్టుకుంటే, మరికొందరు ఎమ్మెల్యే అయితే చాలు మంత్రి పదవి అదే వస్తుందని భావించారట. దానిలో భాగంగానే ఖర్చుకు వెనుకాడలేదట. అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు వారికి అర్థమౌతుంది. పార్టీ నుండి వచ్చిన ఫండ్స్ తో పాటుగా , ఆస్తులని తాకట్టు పెట్టి గెలుపు ముఖ్యమని, ఖర్చుకు వెనకాడకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసారు. అదే ఇప్పుడు వారికి పెద్ద గుది బండలా తయారైందంట.

అసలు విషయం ఏమిటంటే .. గులాబీ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలని హస్తం అభ్యర్థి కంకణం కట్టుకున్నారట. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నియోజకవర్గంలో హడావుడి చేశారట. అలాగే ఈసారి అధికారం కాంగ్రెస్ పార్టీదే ..అధికారం వస్తే మంత్రి పదవి ఖాయం అని తామే మంత్రులమని ప్రచారం చేసుకున్నారట. ఆ దైర్యం తో నియోజకవర్గంలో డబ్బులు నీళ్ల లాగా ఖర్చు చేశారట. కానీ , ఎన్నికల ఫలితాల అన్ని తారుమారై పోయాయి. అటు ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. అలాగే ఆ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. ఆస్తులను అమ్మి ‌ఎన్నికల్లో పోటీ చేసినా, ఫలితం దక్కలేదట. చివరకు ఇప్పుడు వ్యాపారాలు నిలుపుకోవడానికి చాలా కష్ట పడుతున్నట్టు సమాచారం.

ఎన్నికల్లో ఖర్చు కోసం భారీగా అప్పులు చేశారట. ఆస్తులు బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందారట. అప్పుల వల్ల వ్యాపారాలు నష్టాల బాట పట్టాయట. దాంతో బ్యాంకు రుణాలు కట్టలేని స్థితికి చేరుకున్నారట సదరు నేత. రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆస్తుల వేలానికి సిద్దమవుతున్నాయట. దీంతో సదరు నేత ఏంచేయాలో తెలియక లబోదిబోమంటున్నాడు. ఓడిన నాయకుని పరిస్థితి ఇలా ఉంటే, గెలిచిన లీడర్ పరిస్థితి కూడా అలానే వుందట. గెలిచినా కూడా అప్పలు కట్టలేకపోతున్నానని ఆవేదన చెందుతున్నారట.మొత్తానికి ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లడం చివరికి కొంతమంది ఎమ్మల్యేలకు మొదటికే మోసంలా మారింది. ఎమ్మెల్యే అయితే ఎలాగైనా సంపాదించుకోవచ్చని లెక్కలేసే నేతలకు, ఇప్పుడు బ్యాంకుల నోటీసులతో దిమ్మతిరుగుతోంది. డబ్బు, మద్యం జోలికి పోకుండా, నిజాయితీగా ఓట్లు అడిగితే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా అని, రాజకీయ పండితులు అంటున్నారు. అందుకే గతంలో దూకుడుగా వ్యవహరించిన‌ ఎమ్మెల్యేలు, అంతగా అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహం‌ చూపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడటం అంటే ఇదేనేమో కొందరు రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకే మనం మంచం ఉన్నంతవరకే కాళ్లు చాపుకోవాలి ..కాదు అని బయటకి పెడితే ఏమౌతుందో ఎవ్వరం చెప్పలేము. అయిన చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏమి లాభం చెప్పండి..