Begin typing your search above and press return to search.

గౌర‌వం: బేవ‌కూఫ్‌.. మెంట‌ల్ .. ఫూల్‌

By:  Tupaki Desk   |   10 April 2015 7:08 AM GMT
గౌర‌వం:  బేవ‌కూఫ్‌.. మెంట‌ల్ .. ఫూల్‌
X
రాజ‌కీయ నాయ‌కులంటేనే... ఎదురుదాడికి, విమ‌ర్శ‌ల‌కు మారుపేరు. అయితే ఆ విమ‌ర్శ‌ల్లో కాస్త ప‌ద్ద‌తి ఉండాలి. సీనియ‌ర్లుగా ఉన్న వారు..ఓర్పును ప్ర‌ద‌ర్శించాలి. కానీ అలాంటివి క‌రువైపోతున్నాయి. ఎంత తిడితే అంత గొప్ప అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఎర్ర‌గ‌డ్డ‌లోని చాతి ఆస్ప‌త్రిని త‌ర‌లించి సెక్ర‌టేరియ‌ట్ నిర్మించేందుకు సిద్ద‌మైన సీఎం కేసీఆర్ పై బీజేపీ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి దుమ్మెత్త్తిపోశారు. 'హైదరాబాద్‌లో కాలుష్యం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చెస్ట్‌ ఆసుపత్రి అవసరం ఉంది. ఇక్కడ చెస్ట్‌ ఆసుపత్రి వద్దనే మూర్ఖుడు సీ బ్లాక్‌లో తప్ప ఎక్కడైనా ఉంటారా? కొత్త‌ సెక్ర‌టేరియ‌ట్ కోసం త‌ర‌లిస్తున్న‌ చెస్ట్ ఆసుపత్రి భవనం హెరిటేజ్‌ బిల్డింగ్‌. ఆనాలోచిత నిర్ణయాలకు సచివాలయంలోని సీ బ్లాకు నిలయంగా మారింది. మెంటలెక్కిన ప్రభుత్వం అంటే ఇదే' అని ధ్వజమెత్తారు. సచివాలయంలో కోసం ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రిని ఎర్రగడ్డ నుంచి తరలిస్తే ఉద్యమిస్తామని నాగం హెచ్చరించారు. చెస్ట్ ఆస్ప‌త్రిని తరలించొద్దని డిమాండ్‌ చేస్తూ నిర్వహిస్తున్న రిలే దీక్షలకు మద్దతు పలికిన అనంత‌రం నాగం మాట్లాడారు.

మ‌రోవైపు కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పార్టీకే చెందిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. 'టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియామకాన్ని తప్పు పట్టిన కోమటిరెడ్డి ఒక బేవకూఫ్‌. భూమ్మీద ఉన్న పెద్ద మూర్ఖుడు(బిగ్గెస్ట్‌ ఫూల్‌ ఆన్‌ ద ఎర్త్‌)' అని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీకి అవసరమేనని, కానీ... రాహుల్‌ మరిన్ని బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ‌తంలో కొంత మంది రాజీవ్‌గాంధీకి మధ్యవర్తులుగా వ్యవహరించి, ఆయనను తప్పుదారి పట్టించారని, ఇప్పుడు రాహుల్‌ విషయంలోనూ ప‌ల‌వురు నేతలు అలాగే వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలాంటి నేతలను తండ్రివలే రాహుల్‌గాంధీ కూడా దూరం కొట్టాలని అన్నారు