Begin typing your search above and press return to search.
వైసీపీ ఒంటరి పోరుపై కొత్త గుబులు ఏందో...!
By: Tupaki Desk | 10 May 2022 4:51 AM GMTవచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలి. మళ్లీ జగన్ సీఎం కావాలి. ఇదీ.. వైసీపీ స్ట్రాటజీ. ఏ పార్టీ అయినా.. అధికారంలో ఉంటే.. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలనే కోరుకుంటుంది. ఇక, ప్రతిపక్షంలో ఉన్నపార్టీలు అధికారం కోసం వేటాడుతూనే ఉంటాయి.
ఈ పోరులో ఎవరిది పైచేయి అనేది.. ప్రజలే తేల్చాల్సి ఉంటుంది. అయితే.. ఈఓట్ల వేటలో.. పార్టీలు అనుసరించే వ్యూహాలకు ప్రాధాన్యం ఉంటుంది. దీనిలో ప్రదానంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునేందుకు ప్రధాన ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలు వచ్చాయి. సో.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతో కూడిన పక్షంతో అధికారపార్టీ పోరాడాల్సి ఉంటుంది.
అయితే.. అదేసమయంలో వైసీపీ పొత్తులు పెట్టుకుంటుందా? అంటే.. పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు. పై గా పొత్తులు పెట్టుకుందామన్నా..కలిసి వచ్చే పార్టీలూ కనిపించడం లేదు. అయినా..త మకు ఆ అవసరం లేదని.. నాయకులు పదే పదే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఒంటరిగానేఎన్నికలకు వెళ్తుంది. అయితే.. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. గతంలో లేని భయం ఇప్పుడువైసీపీలో కనిపిస్తోం దనే చర్చసాగుతోంది. ఏపీలో సంక్షేమం అమలు చేస్తున్నందున.. అదే తమకు విజయం అందిస్తుందని .. నాయకులు బలంగా నమ్ముతున్నారు.
కానీ, పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను గమనిస్తే.. తమిళనాడులో ఏపీకంటే కూడా సంక్షేమం అమలు జరిగినా.. అక్కడ అన్నాడీఎంకే విఫలమైంది. పంజాబ్‌లో కాంగ్రెస్ కూడా ఇలానే.. పనిచేసినా.. అక్కడ కూడా పార్టీ పరాజయం పాలైంది. మరోవైపు.. ఒడిసాలో పెద్దగాసంక్షేమం అమలు చేయకపోయినా.. అక్క డ నవీన్ పట్నాయక్ సర్కారు మాత్రం వరుస విజయాలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తమకు సం క్షేమం ఏమేరకు పనిచేస్తుందనే ప్రశ్న.. వైసీపీని వెంటాడుతోంది.
దీనికితోడు.. గెలుపు ఓటముల భారాన్ని పార్టీ అధినేత జగన్..నేతలపైనే మోపారు. దీంతో ఖర్చులు కూడా వారే పెట్టుకోవాలనే సంకేతాలు ఆయన పంపించినట్టు అయింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తు న్న పార్టీ నేతలు.. ఒంటరిపోరుపై తీవ్రస్తాయిలో మదన పడుతున్నట్టు.. పార్టీకి స్పష్టమైంది. అందుకే.. గత వారం రోజులుగా కీలక నేతలు లైన్‌లోకి వచ్చి.. పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. గెలుపు గుర్రంకూడా ఎక్కుతుందని పదే పదే చెబుతున్నారు. ఇదంతా కూడా పార్టీలో నెలకొన్న ఒక భయం వాతావరణాన్నితగ్గించేందుకేనని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.