Begin typing your search above and press return to search.
ఏపీలో మద్యం నిషేధంపై రాజకీయ పార్టీల దోబూచులాట..!
By: Tupaki Desk | 24 Dec 2022 4:23 AM GMTఏపీలో మద్యం నిషేధంపై రాజకీయ పార్టీలు దోబూచులాడుతున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఆ తరువాత ఆ హామీని మరిచిపోతున్నాయి. విభజిత ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా మద్యం నిషేధం విధిస్తామని వైఎస్సార్సీపీ చెప్పింది. ఆ తరువాత పార్టీ అధికారంలోకి వచ్చాక.. పూర్తిగా నిషేధం విధించకుండా మద్యం రేట్లు పెంచారు. దీని వల్ల మందుబాబులు తగ్గుతారని దాంతో మద్యం కొనుగోళ్లు పడిపోతాయని అన్నారు. కానీ మద్యం నిషేధం మాత్రం చేయడం లేదు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మద్యం నిషేధం అమలు చేస్తామని చెప్పకుండా.. కల్లు గీత కార్మికులకు మద్యం షాపులను కేటాయిస్తామని హామీ ఇస్తున్నారు. దీనిని భట్టి చూస్తే ఏపీలో మద్యం నిషేధం అమలు హామీ ఉత్త మాటేనా..? అనే చర్చ సాగుతోంది.
విభజిత ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా పాదయాత్ర చేసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా మద్యం నిషేధం అమలు చేసి మహిళలకు అండగా ఉంటామన్నారు. ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని అప్పట్లో ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్యం నిషేధం అమలు చేస్తామని అన్నారు. దీంతో ఈ హామీపై ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మహిళా లోకం జగన్ కు పట్టం కట్టింది.
అయితే అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మద్యం నిషేధం విషయంలో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రం తెలంగాణ కు అధిక ఆదాయం మద్యం పాలసీ ద్వారానే వస్తుంది. ఈ విషయాన్ని బాగా పసిగట్టిన ఆయన మద్యం నిషేధం అమలు చేస్తే తమ ఆదాయం ఎక్కడ పడిపోతుందోనని ఆలోచించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ హామీ విషయంలో ఆందోళన చేయడంతో కరోనా సమయంలో మద్యం రేట్లను అధికంగా పెంచారు. ఇలా ఎక్కువ రేట్లు పెంచడం వల్ల మందుబాబులు తగ్గిపోతారని, ఆ తరువాత మద్యం అమ్మకాలు పడిపోతాయని అన్నారు. కానీ పూర్తిగా మద్యం నిషేధం మాత్రం ప్రకటించలేదు. దీంతో ఈ విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.
అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మద్యం నిషేధం చేస్తామని అనడం లేదు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కల్లు గీత కార్మికులకు మద్యం షాపులను కేటాయించేలా రిజర్వేషన్లు ప్రకటిస్తామని అంటున్నారు. ఇటీవల విజయనగరం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిని భట్టి చూస్తే ఏపీలో మద్యం నిషేధం అమలు సాధ్యం కాదనే విషయం అర్థమవుతోంది. ప్రజలే కాకుండా ప్రభుత్వంలోని కొందరు అధికారులు సైతం మద్యం నిషేధం అమలు కాని విషయమని పేర్కొంటున్నట్లు సమాచారం.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధం ప్రకటించగానే లక్ష్మారెడ్డి అనే వ్యక్తి మద్దతు పలికారు. ఒకప్పుడు మద్యం నిషేధంపై పోరాటం చేసిన ఆయన జగన్ ప్రకటనకు ఆకర్షితులయ్యారు. ఆ తరువాత ఆయనకు వైసీపీ ప్రభుత్వం కేబినెట్ హోదాను కేటాయించింది. అయితే ఆ తరువాత మద్యం నిషేధంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకోవడంతో లక్ష్మారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ కూడా మద్యం నిషేధం చేసే అవకాశం లేదని ఆయనకు అర్థమైందని తెలుస్తోంది.
ఇలా ఏ పార్టీ అయినా మద్యం నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా రంగాల కంటే మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ అదాయం వస్తున్నందున ఈ విషయంలో ఏ సీఎం అయినా కఠిన నిర్ణయం తీసుకోని వారు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.