Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ లో ఒక్క రాత్రిలో ఎంత పంచారంటే?
By: Tupaki Desk | 21 Oct 2019 5:35 AM GMTరెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ఈ ఉదయం మొదలైంది. మొత్తం 302 కేంద్రాల్లో మొదలైన పోలింగ్ ఈ సాయంత్రం ఐదు గంటల వరకూ సాగనుంది. మొత్తం అభ్యర్థులు 28 మంది ఉండగా.. పోటీ మాత్రం అధికార టీఆర్ఎస్.. విపక్ష కాంగ్రెస్ మధ్యనే హోరాహోరీ అన్నట్లుగా సాగుతోంది.
మొత్తం 2,36,842 మంది ఓటర్లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు దాదాపు నాలుగు వేల వరకూ తక్కువ. దాదాపు 1500 మంది వరకు ఎన్నికల సిబ్బంది ఈ ఉప ఎన్నిక కోసం పని చేస్తున్నారు. భద్రత కోసం వందలాది మంది పోలీసుల్ని మొహరించారు.
ఇదిలా ఉంటే.. ఎన్నికల పరిశీలకుల హడావుడితో హుజూర్ నగర్ లో ఆచితూచి అన్నట్లుగా సాగిన ప్రచారం పోలింగ్ కు రెండు రోజుల ముందు జరగాల్సిన కార్యక్రమం మొత్తం దిగ్విజయంగా పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఓటర్లకు డబ్బుల పంపిణీలో తొలుత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. శని.. ఆదివారం రెండు రోజుల్లో రాత్రి వేళ చోటు చేసుకున్న పరిణామాలతో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తాము పంచాలనుకున్న మొత్తాన్ని పంచేసినట్లుగా చెబుతున్నారు.
ఒక్క శనివారం రాత్రి వేళలోనే దగ్గర దగ్గర రూ.35 కోట్లను అన్ని రాజకీయ పార్టీలు పంచినట్లుగా సమాచారం. మరో రూ.20 కోట్ల వరకూ ఆదివారం రాత్రి నాటికి పంపిణీ పూర్తి చేసినట్లుగా తెలుస్తున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా.. డబ్బుతో ఫలితాన్ని తారుమారు చేయాలన్న రీతిలో అభ్యర్థులు వ్యవహరించారని చెబుతున్నారు. ఈ డబ్బుకు అదనంగా మద్యం పంపిణీ జోరుగా సాగినట్లు తెలుస్తోంది.
ఓటుకు కనిష్ఠంగా రూ.500 గరిష్ఠంగా రూ.3వేల వరకూ ఇచ్చినట్లు సమాచారం. ఓటుకు భారీగా చెల్లించిన వారిలో అధికారపక్షానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ అభ్యర్థులకు.. రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించిన ఎన్నికల సంఘం అధికారులు.. పోలీసులు.. చివరి రెండు రోజుల్లో తమ ప్రతాపాన్ని చూపించటంలో ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలాచోట్ల డబ్బు పంపిణీ జరిపిన ప్రాంతాల్లో స్థానికంగా ఉండే గ్రామ దేవతల మీద ప్రమాణం చేయించి.. ఓటు తమకు వేస్తామన్న మాట అనిపించుకున్న తర్వాత డబ్బు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మరి.. డబ్బు పంపిణీ తుది ఫలితం మీద ఎంత ప్రభావం చూపుతుందన్న విషయం.. ఎన్నికల ఫలితంతో మాత్రమే వెల్లడయ్యే అభిప్రాయం ఉందని చెప్పక తప్పదు.