Begin typing your search above and press return to search.

యుద్దానికి ముందే ఇండియా పైచేయి

By:  Tupaki Desk   |   29 Sep 2016 11:14 AM GMT
యుద్దానికి ముందే ఇండియా పైచేయి
X
అగ్రరాజ్యం అమెరికా అంటే పాకిస్తాన్ కు పెద్ద మద్దతుదారు అన్న భావన ఇంతవరకు ఉండేది. కానీ... మోడీ ప్రధాని అయ్యాక అమెరికా భారత్ కు బాగా చేరువయ్యింది. అదే సమయంలో పాక్ కు దూరమైంది. ఈ క్రమంలో తాజాగా ఇండియా పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయగా అమెరికా వెంటనే తన మద్దతు ప్రకటించింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో తమ నుంచి కావల్సినంత సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. అమెరికా స్పందన అంతర్జాతీయంగా భారత్ కు మరింత మద్దతు అందిస్తుందని భావిస్తున్నారు.

కాగా భారత సైన్యం జరిపిన దాడులపై ఇండియాలోనూ పెద్ద ఎత్తున మద్దతు దొరికింది. సుదీర్ఘ కాలం భారత్ ను పాలించిన ప్రధాన పార్టీ కాంగ్రెస్ కూడా సైన్యాన్ని సమర్థించింది.

మన సైన్యం నిన్న నియంత్రణ రేఖను దాటి చేసిన దాడిని కాంగ్రెస్ పార్టీ స‌మ‌ర్థించింది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ట్వీట్ ద్వారా తెలిపారు. మ‌రోవైపు ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా కూడా ఈ అంశంపై స్పందించారు. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం తీసుకున్న నిర్ణ‌యాన్ని, దాడిని త‌మ పార్టీ సమర్థిస్తోందని చెప్పారు. వారి ధైర్యసాహసాలకు తాము సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.