Begin typing your search above and press return to search.

అవెంజర్స్... దీన్నీ పాలిటిక్సు కోసం వాడేస్తున్నారు

By:  Tupaki Desk   |   28 April 2019 6:04 AM GMT
అవెంజర్స్... దీన్నీ పాలిటిక్సు కోసం వాడేస్తున్నారు
X
వాడుకోవడంలో రాజకీయ నాయకులను మించిన వారు ఇంకెవరూ ఉండరేమో. ఎలాంటి సందర్భాన్నైనా - ఏ పరిస్థితులనైనా - ఏ అంశాన్నైనా తమ రాజకీయ అవసరాలు - ప్రయోజనాలకు వాడుకో గల నేర్పరితనం నేతల సొంతం. ప్రధాని నరేంద్ర మోదీ బాలీవుడ్‌ ను తన పబ్లిసిటీ కోసం వాడుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా హాలీవుడ్‌ నే వాడుకుంటోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం విడుదలై విజయవంతంగా నడుస్తున్న ‘అవెంజర్స్‌ - ఎండ్‌ గేమ్‌’ చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా తన ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోంది.

పార్టీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నాయకులు ఈ సినిమా పేరును ఏదో రకంగా తమ ప్రసంగాల్లో వాడుతున్నారట. టెక్నాలజీతో టచ్ ఉన్న నేతలైతే ఈ సినిమాకు సంబంధించి ట్వీట్లు - పేస్ బుక్ పోస్టులు పెడుతున్నారట. అంటే... ప్రస్తుతం అవెంజర్స్ అనేది ట్రెండింగులో ఉన్నది కాబట్టి దాన్ని జనంలోకి తీసుకెళ్లి తామూ నోటీస్ కావడం అన్నమాట. అంతేకాదు.. ‘అవెంజర్స్‌’ చిత్రం ప్రదర్శిస్తున్న మల్లీఫ్లెక్స్‌ లలో కాంగ్రెస్ పార్టీ ప్రచార పోస్టర్లు - సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసింది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు తెలిపేలా దిల్లీ - ముంబయి - అహ్మదాబాద్‌ - లక్నో - గువహటి నగరాలలో 20కి పైగా మల్లీఫ్టెక్స్‌ లలో సైన్‌ బోర్డులు ఏర్పాటు చేసింది. సినిమా విరామ సమయంలో తెరపై ప్రదర్శిస్తోంది. కనీస ఆదాయ పథకం(న్యాయ్‌) గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. భాజపా ప్రచారం అంతా మోదీ చుట్టూనే తిరుగుతుంటే - మా ప్రచారం ప్రజలు - ప్రజల అవసరాల చుట్టూ ఉంటోందని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ పేర్కొంది.

మరోవైపు సమాజ్ వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కూడా అవెంజర్స్‌ ను రాజకీయాల్లోకి చొప్పించారు. ‘భాజపా ఎండ్‌ గేమ్‌ మొదలైందని సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ట్విటర్‌ లో వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని - ఇప్పుడు దాని పతనం మొదలైందన్నారు. అవెంజర్స్‌ చిత్రం పోస్టర్‌ తరహాలో.. ‘మహాకూటమి ప్రభుత్వం’ వస్తోందంటూ పోస్టు చేశారు.