Begin typing your search above and press return to search.

ఒక్క‌మాట... టీడీపీని ఎంత ప‌ని చేస్తోందంటే...!

By:  Tupaki Desk   |   21 Nov 2022 2:30 PM GMT
ఒక్క‌మాట... టీడీపీని ఎంత ప‌ని చేస్తోందంటే...!
X
ఒక్క‌మాట‌.. ఒకే ఒక్క‌మాట‌... టీడీపీని దారుణంగా ఇబ్బంది పాల్జేసింది. దీనిని వెన‌క్కి తీసుకోలేక‌.. అలాగ ని స‌మ‌ర్థించ లేక‌.. చంద్ర‌బాబు స‌హా నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు. అదే.. లాస్ట్ ఛాన్స్‌! క‌ర్నూలు జిల్లా లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు ఎమ్మిగ‌నూరు, ప‌త్తికొండ స‌భ‌ల్లో మాట్లాడుతూ.. ఈ మాట అన్నారు. త‌న‌కు ఇదే ఆఖ‌రి ఎన్నిక‌ల‌ని, చివ‌రి అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. మ‌రి ఈ మాట ఎవ‌రు రాసిచ్చారో తెలియ‌దు కానీ, ఆయ‌న అనేశారు.

అయితే, దీనిని సాకుగా తీసుకున్న వైసీపీ నాయ‌కులు.. చంద్ర‌బాబును తూర్పార‌బ‌ట్టేస్తున్నారు. సోష‌ల్ మీడియాల్లోనూ చంద్ర‌బాబు ఇమేజ్‌కు డ్యామేజీ చేసేలా కామెంట్లు చేయిస్తున్నారు.

ఇక‌, వైసీపీ అనుకూల మీడియాలో అయితే, చంద్రబాబును మ‌రింత దిగ‌జార్చేలా క‌థ‌నాలు వ‌చ్చేశాయి. అస‌లు ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉండగానే చంద్ర‌బాబు ఇలా డీలా ప‌డిపోవ‌డంతో కేడ‌ర్‌లోనూ నిరుత్సాహం పెరిగిపోయింది.

అంతేకాదు, నేత‌ల‌క‌న్నా ముందు.. టీడీపీ అనుకూల మీడియా అయితే,, మ‌రింత‌గా చంద్ర‌బాబును త‌ప్పుబ‌ట్టింది. ఇలా అన‌డం వ‌ల్ల ఓట్ల క‌న్నా.. వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని హిత‌వు ప‌లికాయి. ఈ ప‌రిణామాల‌పై తాజాగా టీడీపీ నిర్వ‌హించిన విస్తృత స్థాయి స‌మావేశంలో చ‌ర్చించారు.

చంద్ర‌బాబు చేసిన లాస్ట్ చాన్స్ డైలాగును అంద‌రూ త‌ప్పుబ‌ట్టారు. ఇది స‌రికాదు అని య‌న‌మ‌ల నుంచి దేవినేని వ‌ర‌కు అంద‌రూ ముక్త‌కంఠంతో చెప్పారు. దీనికి విరుగుడుగా మ‌రో నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌లుపుతిప్పారు. ఇవి రాష‌ష్ట్ర్ట్రానికే చివ‌రి ఎన్నిక‌ల‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అందుకే తాను అలా వ్యాఖ్యానించాన‌ని.. యూట‌ర్న్ తీసుకున్నారు. రాష్ట్రానికి ఇవి చివ‌రి ఎన్నిక‌లు అన‌డంలోనూ ఔచిత్యం క‌నిపించ‌క‌పోయినా.. ఆయ‌న ఏదో స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం అయితే చేశారు. ఇక‌, ఇది ఏమేర‌కు ఫ‌లిస్తుందో.. జ‌రిగిన డ్యామేజీని ఎలా స‌రిదిద్దుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.