Begin typing your search above and press return to search.
పొలిటికల్ పంచ్ రవి ని విడుదల చేశారు
By: Tupaki Desk | 22 April 2017 7:33 AM GMTసోషల్ మీడియాలో ఇబ్బందికరమైన పోస్టులు - కామెంట్లు పెడుతున్నారనే అభియోగిస్తూ పొలిటికల్ పంచ్ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్ ను అరెస్టు చేసిన ఎపిసోడ్ పై ఏపీ సర్కారు ఎట్టకేలకు దిగివచ్చింది. ఒక రోజు దర్యాప్తు అనంతరం పోలీసులు ఆయన్ను విడిచిపెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని తన నివాసంలో ఉన్న రవికిరణ్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు ఆ మరుసటి రోజు ఆయన నివాసం వద్దే వదిలిపెట్టడం గమనార్హం. రవికిరణ్ అరెస్ట్ పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దుమారం రేగిన నేపథ్యంలో పోలీసులు స్పందిస్తూ సీఎం చంద్రబాబు - మంత్రి లోకేశ్ లపై అభ్యంతరకరంగా వెబ్ సైట్ లో ప్రచారం చేస్తున్నందుకుగాను అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు. అయితే కారణం ఏమీ వెల్లడించకుండానే విడుదల చేశారు.
కాగా, తన అరెస్టుపై సన్నిహితులతో రవికిరణ్ మాట్లాడుతూ తన అరెస్టు అనంతరం మందడంలోని ఎస్పీ ఆఫీసుకు తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వేర్వేరు వాహనాల్లో రాజధాని ప్రాంతంలోని సీఎం ఆఫీసు చుట్టూ తిప్పి ఓ గెస్ట్ హౌస్ లో విచారణ చేసినట్లు తెలిపారు. పొలిటికల్ పంచ్ పోస్టింగ్ ల వెనుక ఎవరు ఉన్నారు? వైసీపీకి ఉన్న సంబంధం ఏంటి? ఆ పార్టీ నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నావా?అంటూ ప్రశ్నల వర్షం గుప్పించారని రవికిరణ్ వెల్లడించారు. అయితే తన పేజీ ద్వారా చేసే పోస్ట్ లకు తానే బాధ్యుడినని తెలిపినట్లు రవికిరణ్ చెప్పారు. కాగా, ఈనెల 25 - 26వ తేదీల్లో మళ్లీ స్టేషన్ కు రావాలని పోలీసులు ఆదేశించినట్లు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/