Begin typing your search above and press return to search.
మైండ్ బ్లోయింగ్ సర్వే.... వైరల్ ... ?
By: Tupaki Desk | 2 May 2022 5:30 PM GMTఏపీలో ఎన్నికలు ఇంకా రెండేళ్ళ వ్యవధిలో ఉండగానే సర్వేల గోల స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యనే మొత్తానికి మొత్తం అంతే 175 సీట్లను గెలిచి తీరుతామని జగన్ పార్టీ నేతల సమావేశంలో చెప్పారు. మరి ఆయనకు ఉన్న సర్వే నివేదికలు అంచనాలను బట్టి చెప్పి ఉంటారేమో అని ఆ పార్టీ నాయకులు అంతా భావించారు. అదే టైమ్ లో 160 సీట్లు టీడీపీవే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతున్నారు. మరి ఆయన కూడా ఏ లెక్కలూ లేకుండా మాట్లాడరు కదా అన్నది మరో వాదన.
ఈ రెండు పార్టీల అంచనాలు, సర్వేలను మించిన సర్వే ఒకటి ఇపుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటీ అంటే ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జనసేనకు 75 సీట్లు వస్తాయట. అలాగే అధికార వైసీపీకి 55 సీట్లు మాత్రమే వస్తాయని, టీడీపీకి 45 సీట్లు వస్తాయని చెబుతున్నారు. మరి ఈ సర్వే జనసేన చేయించినదా లేక ఆ పార్టీ సానుభూతిపరులు చేయించినదా, లేక మైండ్ గేమ్ కోసం ఇలాంటి సర్వేను ఆ పార్టీ వారు జనాల్లోకి వదిలారా అన్న చర్చ అయితే వస్తోంది.
మొత్తానికి చూస్తే ఇది మైండ్ బ్లోయింగ్ సర్వేగానే చూడాలి. జనసేనకు 2019 ఎన్నికల్లో వచ్చినది కేవలం ఒకే ఒక్క సీటు. ఇక మూడేళ్ళ వ్యవధిలో కూడా ఆ పార్టీ సంస్థాగతంగా బలపడినది పెద్దగా లేనే లేదనే చెబుతారు. అయితే పవన్ క్రేజ్ మాత్రం ఈ మధ్యన బాగా పెరిగింది. అది ఎంతవరకు ఓటు బ్యాంక్ గా టర్న్ అవుతుంది అన్నది చూస్తే పెద్ద డౌట్. ఇక మరో వైపు జనసేనలో ఈ రోజుకు కూడా పవన్ నాదెండ్ల మనోహర్ తప్ప చెప్పుకోదగిన నాయకుడు అంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన నాయకుడు అయితే లేరు.
ఇక చూస్తే మొత్తం 175 సీట్లలో జనసేన పోటీ చేయాలనుకున్నా బలమైన అభ్యర్ధుల కొరత ఉంటుందని కూడా ఇంకో రకంగా టాక్ ఉంది. ఇవన్నీ చూస్తే జనసేన కేవలం పవన్ సినీ పొలిటికల్ గ్లామర్ మీద, ఆయన సామాజికవర్గం బలం ఆధారపడి ఈ రోజుకీ సాగుతోంది. ఇక పొత్తుల ఎత్తులు ఫలిస్తే మాత్రం ఏపీలో జనసేన దూకుడు గట్టిగానే ఉంటుంది.
కానీ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సర్వే మాత్రం అలా ఇలా లేదు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో హంగ్ వస్తుందనే సంకేతాలతో ఈ సర్వే వివరాలు ఉన్నాయి. అదే టైమ్ లో టీడీపీ మరీ తక్కువగా 45 సీట్లకే పరిమితం అవుతుంది అని కూడా సర్వేలో పేర్కొనడం బట్టి చూస్తే ఇది పొత్తుల కోసం టీడీపీని బెండ్ చేసేందుకు సీట్లను ఎక్కువ రాయబేరాల ద్వారా తెచ్చుకోవడానికి, రేపటి రోజున పవర్ షేరింగ్ కోసం వేస్తున్న ఎత్తుగడగా చూస్తున్నారు.
మొత్తానికి ఈ సర్వే ఎవరు చేయించారో తెలియదు కానీ జనసేన సొంతంగా పోటీ చేస్తే కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 75 సీట్లకు చేరువ అవుతుంది అనుకుంటే మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో సులువుగా మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లను కూదా చేరుకుంటుందనే చెప్పాలి. మరి ఈ సర్వే మాత్రం జనసైనికులకు ఉత్సాహాం ఇస్తూంటే అసలు ఏపీలో గ్రౌండ్ లెవెల్ లో ఇలాంటి పరిస్థితి ఉందా అన్న చర్చ అయితే వేడిగా వాడిగా అధికార విపక్ష పార్టీలలో చర్చగా సాగుతోంది.