Begin typing your search above and press return to search.
ప్రశాంత్ కిషోర్‌ను రేవంత్ టీం పనిచేయనిస్తుందా!
By: Tupaki Desk | 6 Dec 2021 9:32 AM GMTతెలంగాణలో రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. 2023లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వ చ్చేందుకు.. అధికార పార్టీ టీఆర్ ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్ష పోరు పెరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు అవలంభించిన విధానాలకు భిన్నంగా.. టీఆర్ ఎస్ వ్యవహరించనుంది.
నిజాని కి రాజకీయాల్లో.. తనను మించిన మేధావి.. తన కన్నా వ్యూహాలు వేయగల దిట్ట.. రాష్ట్రంలో ఎవరూ లేరని.. అందరూ సన్నాసులేనని పదేపదే చెప్పే సీఎం కేసీఆర్.. ఇప్పుడు అనూహ్యంగా పంథా మార్చుకున్నారు.
దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం పొందిన వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్‌ను.. టీఆర్ ఎస్ నియమించుకునేందు కు రెడీ అయినట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రశాంత్ కిశోర్ నేరుగా టీఆర్ ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారని.. కూడా వార్తలు వచ్చాయి. అంటే.. టీఆర్ ఎస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పీకే పనిచేయనున్నారని తెలుస్తోంది.
గత 2019 ఎన్నికల్లో ఏపీలో పనిచేసిన పీకే.. ఇక్కడ జగన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇలా.. వ్యూహాత్మకంగా వ్యవహరించే పీకే.. విషయంలో ఇప్పుడు కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
అయితే.. తెలంగాణ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే.. కొన్ని భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ యువ నాయకుడు.. ఫైర్ బ్రాండ్.. రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు.
గతానికి భిన్నంగా కాంగ్రెస్‌ను నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలోనూ రేవంత్ ముందు వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ దూకుడు.. ధాటి ముందు. ప్రశాంత్ కిశోర్ టీం అసలు ఏమేరకు పనిచేస్తుంది? అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే.. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను రేవంత్ బలంగా ఎండగడుతున్నారు.
ఈ నేపథ్యంలో రేవంత్ తెరమీదికి తెస్తున్న ప్రతివిషయం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అదేసమయంలో కొందరు నేతలు..కూడా ప్రజల్లో బలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీకే బృందాన్ని తెలంగాణలో రేవంత్ టీం పనిచేసుకోనిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.