Begin typing your search above and press return to search.

వీవీఆర్ ఆడియోలో పొలిటికల్‌ భజనలు

By:  Tupaki Desk   |   28 Dec 2018 12:33 PM GMT
వీవీఆర్ ఆడియోలో పొలిటికల్‌ భజనలు
X
ఒక ఆడియో ఫంక్షన్‌ అంటే.. పొగడ్తలు మామూలే. అసలు సినిమా ఫంక్షన్లన్నీ పొగడ్లతోనే ఉంటాయి. ఒకరిని ఒకరు పొగడుకుంటూ.. అందరూ ఆరోజు భజన్‌ లాల్‌ అవతారం ఎత్తుతారు. బండ్ల గణేష్ లాంటి వాళ్లు భజన్‌ లాల్‌ అనే పదానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారిపోతే.. మిగిలిన వాళ్లు మాత్రం.. వచ్చిన అతిథిని కీర్తించి మమ అన్పించేస్తారు. కానీ నిన్న జరిగిన వీవీఆర్‌ ఆడియో మాత్రం.. పొలిటికల్ భజనలకు కేరాఫ్‌ గా మారింది.

అసలు కార్యక్రమం మొదలే.. వేడుక నిండా జనసేన జెండాలే. టీ కప్పు పోస్టర్లే. తీసుకొచ్చింది అభిమానులు. వారిని ఏమీ అనలేం. దీంతో స్టేడియం లోపలికి రానివ్వక తప్పలేదు. అభిమానులు వచ్చిన తర్వాత ఊరికే ఉంటారా. జై జనసేన, జై పవన్‌ కల్యాణ్‌ అంటూ స్లోగన్స్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. మెగాస్టార్‌, రామ్‌ చరణ్‌ కు అంటే అలవాటు అయిపోయాయి కానీ.. కేటీఆర్‌ కు కొత్త కదా. కాస్త ఇబ్బంది పడ్డారు. మీరు ఆపితే నేను మాట్లడతానంటూ ఒకొనొక సందర్భంలో అన్నారు.

ఆడియోకు ఛీప్‌ గెస్ట్‌ కేటీఆర్‌. కింగ్‌ కాదు కాని కింగ్ మేకర్‌. కింగ్‌ కంటే కింగ్‌ మేకర్‌ పై వేల్యూ ఎక్కువ. అందుకే.. ఫంక్షన్‌ కి వచ్చిన ప్రతీ ఒక్కరూ కేటీఆర్‌ ని తన భజనలతో ఆకాశానికి ఎత్తేశారు. కేటీఆర్‌ స్టేజ్‌ ఎక్కకముందే ఆయన పై ఆరు నిమిషాల ఏవీ ప్రసారమైందంటే.. సిట్యువేషన్‌ ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు. బోయపాటి మైక్‌ అందుకోగానే.. కేటీఆర్‌ ని ఆకాశానికి ఎత్తేశారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ కీర్తించారు. ఇండస్ట్రీలో చిరంజీవి-రామ్‌ చరణ్‌ అని, రాజకీయాల్లో కేసీఆర్‌-కేటీఆర్‌ అంటూ పొగిడేశారు. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ వంతు. రాజకీయ నాయకుడిగా కంటే కేటీఆర్ రామ్‌ చరణ్‌ కు మంచి ఫ్రెండ్‌. దీంతో.. సహజంగానే పొగడక తప్పలేదు. రాజకీయాల్లో దూసుకుపోతున్నారని.. తండ్రికి తగ్గ తనయుడు అని కీర్తించారు. ఈ టైమ్‌ లో అబిమానులు చరణ్‌ కు అడ్డు తగిలారు. పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడమని ఒకటే ఈలలు కేకలు. దీంతో.. చరణ్‌ కు మాట్లాడక తప్పలేదు. “ఈ మధ్య ఎవ్వరూ జ్యాస్‌ లు కాఫీలు తాగడం లేదు. అందరూ టీలే తాగుతున్నారు” అంటూ పవన్‌ కల్యాణ్‌ ని గుర్తు చేస్తూ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

రామ్‌ చరణ్‌ తర్వాత కేటీఆర్‌ మాట్లాడారు. ఆయన స్పీచ్‌ కూడా మొత్తం పొలిటికల్‌ వేలోనే కొనసాగింది. మధ్య మధ్య సరదాగా జోకులు వేస్తూ.. పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోఉన్నారని.. సినిమాల్లో ఎలా అయితే సక్సెస్‌ అయ్యారో.. రాజకీయాల్లో విజయం సాధించాని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చరణ్‌ జోరు చూస్తుంటే.. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో చరణ్‌ రాణిస్తానంటూ చమత్కరించారు. ఇది చూసి చరణ్‌, మెగాస్టార్‌ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్‌ కు చిరంజీవి సైగ చేసేసరికి.. దానికి ఇంకాస్త టైమ్‌ ఉంది అంటూ కవర్‌ చేసేశారు.

లాస్ట్‌ బట్‌ నాట్‌ ద లీస్ట్‌... మెగాస్టార్‌ టైమ్‌. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు.. ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ కేటీఆర్‌ హావా కొనసాగిందని ఆకాశానికి ఎత్తేశారు చిరంజీవి. కేటీఆర్‌ తన బెంచ్‌ మేట్‌ అని.. 2009 నాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. కేటీఆర్‌ స్పీచ్‌ లు అద్భుతంగా ఉంటాయని.. ఏ అంశం పైనా ఆయన అనర్గళంగా మాట్లాడగలరని.. సిరిసిల్ల అభివృద్ధికి కేటీఆరే కారణం అంటూ పొగిడేశారు. మధ్య లో పవన్‌ కల్యాణ్‌ గురించి చెప్పక తప్పలేదు చిరంజీవికి. తమ్ముడు స్విజ్జర్లాండ్‌ వెళ్లాడు అని చెప్పి.. అక్కడ నుంచి వేరే టాపిక్‌ లోకి స్కిప్‌ అయిపోయారు. మొత్తానికి.. కేటీఆర్‌ రావడంతో.. వినయ విధేయ రామ కార్యక్రమం మొత్తం ఒక పొలిటికల్ సభను తలపించింది.