Begin typing your search above and press return to search.

హ‌రియాణాలో రాజ‌కీయ వైకుంఠ‌పాళి... మ‌రో కుమార‌స్వామి...!

By:  Tupaki Desk   |   24 Oct 2019 8:21 AM
హ‌రియాణాలో రాజ‌కీయ వైకుంఠ‌పాళి... మ‌రో కుమార‌స్వామి...!
X
దేశ‌రాజ‌ధాని ఢిల్లీకి అంచుల్లో ఉన్న హ‌రియాణాలో రాజ‌కీయ వైకుంఠ పాళి ప్రారంభ‌మైందా? ఎన్నిక‌ల ఫ లితాలు పూర్తిగా వెలువ‌డ కుండానే అధికారం కోసం ప్ర‌ధాన పార్టీలు వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో మునిగిపోయా యా? ఎత్తుకు పైఎత్తులు వేసుకునేందుకురెడీ అయ్యాయా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబందించిన ఫ‌లితాలు గురువారం వెల్ల‌డ‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న బీజేపీ ఒకింత వెనుక‌బ‌డింది. మ‌రోసారి అధికారం చేజిక్కించుకుని కాషాయ‌ద‌ళం పాల‌న చేయాల‌ని భావించిన ప్ర‌జ‌ల ఆగ్ర‌హంతో త్రిశంకు స్వ‌ర్గానికి ప‌రిమిత‌మైంది.

పోనీ, అలాగ‌ని ప్ర‌జ‌లు ఇక్క‌డ మ‌రో ప్ర‌ధాన పార్టీ కాంగ్రెస్‌కు ప‌గ్గాలు అప్ప‌గించారా? అంటే అది కూడా జ‌ర‌గ‌లేదు. మొత్తం 90 స్థానాలున్న హ‌రియాణాలో 40 సీట్ల‌లో బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా కాంగ్రెస్ ముక్కీ మూలిగీ కేవ‌లం 31 స్థానాల‌లో మాత్ర‌మే ముందంజ‌లో ఉంది. ఇక‌, స్థానికంగా తెర‌మీదికి వ‌చ్చిన జ‌న‌నాయ‌క్ జ‌న‌తా పార్టీ(జేజేపీ) 20 స్థానాల్లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. దీంతో ఈ పార్టీ అవ‌స‌రం లేకుండా రెండు ప్ర‌ధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఈ క్ర‌మంలోనే ముందుగా గోవా లాంటి చోట్ల జ‌రిగిన పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా కాంగ్రెస్ చ‌క్రం తిప్పింది.

ఈ క్ర‌మంలోనే జేజేపీకి సీఎంసీటును ఆఫ‌ర్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అంటే జేజేపీతో పొత్తుకు ఆల్రెడీ కాంగ్రెస్ మాన‌సికంగా సిద్ధ‌మైపోయింది. బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా చేసే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ దూసుకుపోయింది. దీంతో ఇక్క‌డ క‌ర్ణాట‌క త‌ర‌హా రాజ‌కీయ వాతావ‌ర‌ణం తెర‌మీదికి వ‌చ్చింది. కానీ, బీజేపీ కూడా త‌క్కువేమీ తిన‌లేదు. ఆ పార్టీ కూడా ఇప్ప‌టికే జేజేపీతో పొత్తుకు సంకేతాలు పంపుతోం ది. అయితే, సీఎం సీటు విష‌యంలో మాత్ర‌మే ఈ రెండు పార్టీల మ‌ధ్య త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతోంది. అవ‌స‌ర‌మైతే సీఎం సీటు ఆ పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలాకు ఇచ్చే అవ‌కాశం కూడా ఉంది. అదే జ‌రిగితే దుష్యంత్ మ‌రో కుమార‌స్వామి అవ్వ‌డం ఖాయం.

అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే బ‌లం ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి.. బీజేపీ దూకుడుకు జేజేపీ హుజూర్ అన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డినా ఆశ్చ‌ర్యం లేదు. పోనీ.. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. త‌ర్వాత కాలంలో అయినా .. అంటే ఒక‌టి రెండు మాసాల్లోనే ఇక్క‌డ క‌ర్ణ‌టక త‌ర‌హాలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాన్ని కొట్టేయ‌లేమ‌నేది విశ్లేష‌కుల మాట‌. ఏదేమైనా.. హ‌రియాణా తీర్పు మ‌రో క‌ర్ణాట‌క త‌ర‌హా తీర్పు మాదిరిగా ఉంద‌నేది వాస్త‌వం.