Begin typing your search above and press return to search.
'పొలిటికల్ యాదాద్రి' అనేక విమర్శలు.. ఎందుకిలా జరిగింది?
By: Tupaki Desk | 28 March 2022 11:36 AM GMTతెలంగాణ తిరుమల క్షేత్రంగా భాసిల్లాలనే.. సత్సంకల్పంతో వందల కోట్ల రూపాయలు వెచ్చింది.. పున ర్నించిన భువనగిరి జిల్లా యాదాద్రి పనులు.. పూర్తి చేసుకుని.. నేడు సీఎంకేసీఆర్ చేతుల మీదుగా మహా కుంభాభిషేకం నిర్వహించుకుంది. ఇక, త్వరలోనే ఇదే దేశవ్యాప్తంగా ఖ్యాతి నొంది..లక్షల మంది భక్తుల కు దేదీప్యమాన దేవాలయంగా మారనుంది. అయితే.. అంత పెద్ద గుమ్మడి కాయకూడా.. చిన్న కత్తిపీటకు లోకువ అన్న చందంగా.. ఇంత పెద్ద క్రతువు కూడా.. చిన్న చిన్న విమర్శల ముందు.. తేలికగా మారిపో యింది.
రెండు కీలక విమర్శలు. ఇటు కార్యక్రమంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకటి.. యాదాద్రి పునర్నిర్మాణాని కి సంబంధించి ఆది నుంచి సలహాలు.. సూచనలు చేసిన... త్రిదండి చిన జీయర్ స్వామిని ఆహ్వానించ కపోవడం. రెండు ఎలాంటి ప్రొటోకాల్ పాటించకుండా.. ఇష్టానుసారం అధికారులు వ్యవహరించారనే విమర్శలు రావడం. ఈ రెండు విషయాలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్‌కు అత్యంత ప్రాణసమానంగా మారిన చినజీయర్ లేకుండానే ప్రస్తుతం క్రతువంతా సాగిపోతోంది.
నిజానికి మహాకుంభాషేకానికి.. ఇటు ఆలయం నుంచి కానీ, అటు ప్రభుత్వం నుంచి కానీ.. జీయర్ స్వామికి సమాచారం ఉంటుందని... ఆయనను ఆహ్వానిస్తారని.. అందరూ అనుకున్నారు. కానీ, ఎలాంటి ఆహ్వానా లు అందలేదు. పైగా.. 'అందరూ ఆహ్వానితులే' అని ఆలయ అధికారులు తేల్చి చెప్పారు.
ఈ పరిణామం పై.. హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. మరోవైపు.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంవో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి తనను పిలవలేదని మండిపడ్డారు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆహ్వానించారని ట్విట్టర్లో వెల్లడించారు. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేయడం చాలా బాధాకరమని ఎంపీ కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి కారణం.. ఈయన స్థానిక ఎంపీ. సో.. ఆయనకు ఆహ్వానం లేదు. ఈ రెండే కాదు.. చిన్న చిన్న కారణాలతో అనేకమంది దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ యాదాద్రిగా ఈ కార్యక్రమం మారిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.