Begin typing your search above and press return to search.

ఓటు వేయాలా? డ‌బ్బులు కొట్టండి.. మారిన జ‌నం తీరు!

By:  Tupaki Desk   |   9 April 2021 2:30 PM GMT
ఓటు వేయాలా?  డ‌బ్బులు కొట్టండి.. మారిన జ‌నం తీరు!
X
రాజ‌కీయ నేత‌ల‌కు పెద్ద అగ్నీ ప‌రీక్ష ఎదురైంది. ప్ర‌జ‌ల‌కు ఏదైతే అల‌వాటు చేశారో.. అదే ఇప్పుడు వారికి పెను శాపంగా మారిపోయింది. ఈ మాట అంటోంది ఏ ప్ర‌తిప‌క్షాలో కిట్ట‌నివారో.. కాదు.. ప్ర‌జానాడిని ద‌గ్గ‌ర‌గా చూసిన‌.. మేధావులు... రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఓటర్ల‌కు ఉన్న ఏకైక‌, స్వ‌చ్ఛంద హ‌క్కు ఓటును వినియోగించుకోవ‌డ‌మే. త‌ద్వారా.. త‌మ‌కు మంచి ప‌నులు చేసి పెట్టే అభ్య‌ర్థుల‌ను ఎన్నుకోవ‌డ‌మే. అయితే.. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా ఓటర్ల‌ను అనేక ప్ర‌లోభాలకు గురి చేసేశారు రాజ‌కీయ నాయ‌కులు.

ఓట్ల‌ను కొనుగోలు చేయ‌డం మొదలు పెట్టారు. ఓటు ఇంత‌ని లెక్క‌గ‌ట్టారు. ప్ర‌త్య‌ర్థులు రూపాయి ఇస్తే.. తాము రెండు రూపాయ‌లు ఇవ్వ‌డం.. అలవాటు చేశారు. దీంతో ప్ర‌జ‌లు కూడా ఓట్ల‌ను ఎందుకు ఊరికేనే వేయాలి? ఎందుకు గంట‌ల త‌ర‌బ‌డి ప‌నులు మానుకుని వెళ్లి ఓట్లేయాలి? డ‌బ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తాం! అనే ప‌రిస్థితికి వ‌చ్చేశారు. దీంతో ఇప్పుడు రాజ‌కీయ నేత‌ల‌కు నోట రాకుండా పోయింది.తాజాగా జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌హిష్క‌రించి.. ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంది. అంటే.. మాకు మీ ఓట్లు అక్క‌ర్లేదు.. మీరే తేల్చుకోండి ! అని ఓట‌ర్ల‌కు తేల్చి చెప్పింది.

దీంతో ఎన్నిక‌లు ఏక‌ప‌క్షం అవుతాయ‌ని.. త‌మ‌కే ప్ర‌జ‌లు ఓట్లు వేస్తార‌ని.. ఎలాగూ.. టీడీపీ లేదు క‌నుక డ‌బ్బులు కూడా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని భావించిన వైసీపీ నాయ‌కులు ఎవ‌రికీ డ‌బ్బులు పంచ‌లేదు. దీంతో ప్ర‌జ‌లు చివ‌రి నిముషం వ‌ర‌కు డ‌బ్బులు ఇస్తార‌ని.. ఓట్లు వేద్దామ‌ని ఎదురు చూశారు. కానీ, వైసీపీ నేత‌లు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయే స‌రికి .. ఇంటి నుంచి కాలు బ‌య‌ట పెట్టలేదు. దీంతో ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు కూడా చాలా జిల్లాల్లో 30శాతం ఓట్లు కూడా ప‌డ‌లేదు. దీంతో బెంబేలెత్తిన‌.. వైసీపీ నాయ‌కులు .. ఓట‌ర్ల‌ను బ్ర‌తిమాలుకునే ప‌నిలో ప‌డ్డారు.

ఈ క్ర‌మంలో నాయ‌కులు ఓట‌ర్ల ఇళ్ల‌కు వెళ్లి.. రండి ఓటేయండి! అని పిలుపునిచ్చారు. దీనికి చాలా చోట్ల ప్ర‌జ‌లు.. మాకు మీరు డ‌బ్బులు ఇచ్చారా? మేం ఎందుకు ఓటేయాలి? అని ప్ర‌శ్నించారు. చివ‌రి రెండు గంట‌ల్లో ఈ ప‌రిణామం ఎదుర‌య్యే స‌రికి వైసీపీ నేత‌లు చుక్క‌లు క‌నిపించాయి. గ‌తంలో అయితే.. టీడీపీ కూడా బ‌రిలో ఉండే స‌రికి టీడీపీకి కాకుండా త‌మ‌కే వేయాల‌ని వైసీపీ.. అధికార పార్టీకి కాకుండా మాకే వేయాల‌ని టీడీపీ వాళ్లు అంతో ఇంతో ఓట‌ర్ల‌కు ముట్ట‌జెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు వైసీపీ ఒక్క‌టే బ‌రిలో నిల‌వ‌డం, టీడీపీ బ‌హిష్క‌రించ‌డంతో ప్ర‌జ‌లు కూడా త‌మ‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేదు కాబ‌ట్టి మేం ప‌నులు ఎందుకు మానుకోవాల‌ని ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. మొత్తానికి ఈప రిణామాల‌ను విశ్లే షిస్తే.. ఓట్లు ఊరికే ప‌డ‌వు.. డ‌బ్బులు కొట్టాల్సిందే! అని నాయ‌కులు స్ప‌ష్ట‌మైంద‌ట‌! ఏదేమైనా.. నీవు నేర్పిన విద్య‌యే క‌దా.. నీర‌జాక్షా!! అంటున్నారు ఓటర్లు. దీంతో నేత‌ల‌కు నోట మాట రావ‌డం లేదు. ఇదీ సంగ‌తి!!