Begin typing your search above and press return to search.
ఎన్నికల టైం గురు.. బట్టలుతుకుతారు.. దోశలు వేస్తారు ..!
By: Tupaki Desk | 27 March 2021 4:30 PM GMTఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులు గల్లీకి తిరుగుతుంటారు. ఇస్త్రీ డబ్బా వద్దకు వచ్చి ఇస్త్రీ చేస్తారు. సెలూన్‌కు వెళ్లి కటింగ్ చేస్తారు. హోటల్‌కు వెళ్లి ప్లేట్లు కడుగుతారు. చిన్న పిల్లలకు స్నానం చేపిస్తారు. ఇంకా ఏపనైనా చేస్తారు. దక్షిణాదిన ఇటువంటి రాజకీయాలు ఎక్కువ. ఇక తమిళనాడు గురించి చెప్పనవసరం లేదు. అతి చేష్టలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ నేత బట్టలు ఉతికిన వీడియో సంచలనంగా మారింది. అయితే తాజాగా ప్రముఖ సినీ నటి ఖుష్బూ దోశలు వేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారు.
చెన్నై థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున సినీ నటి ఖుష్బూ పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఆమె ముందుగా చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా ఓ సీటు ఆమెకు దక్కలేదు. దీంతో ఆమె చైన్నైలోని థౌజండ్ లైట్స్ ను ఎంచుకున్నారు. ఇక్కడ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ హోటల్ కు వెళ్లి కస్టమర్లను పలుకరించారు. హోటల్ యజమానితో మాట్లాడారు. అనంతరం అక్కడ దోశ వేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఆమె ఎన్నో జిమ్మిక్కులు చేస్తున్నారు. అయితే ఇక్కడో ఫన్నీ ఘటన జరిగింది. పెనంపై నూనె రాయకుండానే దోశ వేసేందుకు యత్నించారు. కానీ అది రాలేదు. ఆ తర్వాత మరోసారి ట్రై చేశారు. ఈ సారి నూనె రాశారు. దీంతో దోశ పర్ఫెక్ట్గా వచ్చింది.
ఇదిలా ఉంటే తమిళనాట ఎన్నికల సిత్రాలు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారం నిర్వహిస్తున్నారు. స్మృతీ ఇరానీ కూడా ప్రచారం చేస్తున్నారు. ఆమె తమిళ ప్రజలతో కలిసి దాండియా ఆడారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళనాడులో అధికార అన్నాడీఎంకేకు కాస్త గడ్డు కాలమే కనిపిస్తున్నది. అక్కడ ఆ పార్టీ తరఫున గట్టిగా ప్రచారం చేసే నేత ఒక్కరు కూడా లేరు. దీంతో డీఎంకే అధినేత స్టాలిన్ దూసుకుపోతున్నారు.
మరోవైపు కమల్ హాసన్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.