Begin typing your search above and press return to search.
పాలిటిక్స్ చీతా : మోడీ వర్సెస్ కాంగ్రెస్
By: Tupaki Desk | 19 Sep 2022 4:30 AM GMTప్రాజెక్ట్ చీతా పేరిత ఈ దశాబ్దంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ని చేపట్టామని బీజేపీ గొప్పగా చెప్పుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం వేళ నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో పద్దెనిమిది గంటలు ప్రయాణం చేయించి మరీ తెప్పించిన ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్ లోని కూనా నేషనల్ పార్క్ లో ప్రధాని మోడీ ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము పర్యావరణానికి ఎంతో కృషి చేస్తున్నామని అంతరించిపోయిన చీతాలను దేశానికి రప్పించడమే దానికి సాక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ తీసుకుంటే ఈ విషయంలో ఏమీ చేయలేదని దుయ్యబెట్టారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత పర్యావరణానికి పెద్దపీట వేసేందుకు ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్‌పై మోదీ దారుణంగా విమర్శించారు. మరి కాంగ్రెస్ ఊరుకుంటుందా.
నాడు యూపీయే సర్కార్ లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న జైరాం రమేష్ దీని మీద గట్టిగానే స్పందించారు. తాను మంత్రిగా ఉన్నపుడే ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టామని చెపారు. చిరుతలను భారత్ కి తెచ్చేలా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాల్సిందిగా వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాను తాను ఒక లేఖలో అభ్యర్థించానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ లేఖ కూడా ఆయన విడుదల చేయడంతో బీజేపీ ఇరుకున పడినట్లు అయింది.
తాను రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నందున ఆ లేఖను పబ్లిక్ డొమైన్‌లో వెంటనే పోస్ట్ చేయలేదని కూడా రమేష్ చెబుతూ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చేశారు. అయితే యూపీయే సర్కార్ ఈ విషయంలో ప్రయత్నాలు చేసినా అది సఫలం కాలేదు. 2012లో, ఆఫ్రికన్ చిరుతలను భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడం కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నిబంధనలకు విరుద్ధమని వన్యప్రాణి సంరక్షణకారుల వాదనను అనుసరించి దేశంలోకి చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడంపై యూపీయే సర్కార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అలా నాడు అది ఆగిపోయింది. అయితే తిరిగి 2017లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కోర్టులో అఫిడవిట్‌ను సమర్పించింది, ఇది చట్టబద్ధమైనందున భారతదేశానికి ఆఫ్రికన్ చీతాలను తీసుకురావడానికి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ తన ఆమోదం తెలిపింది. ఆ తరువాత సుప్రీం కోర్టు కూడా ఈ ప్రాజెక్టుకు సమ్మతి తెలిపింది. అలా ఇపుడు మోడీ తన జన్మ దినం వేళ ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్ లోని పార్కులో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయింది.
అంటే దీని వెనక తొలి ఆలొచన కసరత్తు కాంగ్రెస్ దే అని జై రాం రమేష్ అంటున్నారు. అంతే కాదు ఆయన మోడీని ఈ విషయంలో అబద్ధాలు చెబుతున్నారు అని నిందించారు. ఇలా చెప్పుకోవడం బీజేపీ వారికి బాగా అలవాటే అని కూడా అయన విమర్శిస్తున్నారు. మొత్తానికి 1952లో అంతరించిన జంతువుగా ఉన్న చీతాలు దేశంలో ప్రవేశించడం మంచి పరిణామమే కానీ వాటితో పాటే సరికొత్త రాజకీయం కూడా దేశంలో మళ్ళీ ప్రవేశించింది అంటున్నారు. ప్రాజెక్ట్ చీతా గా బీజేపీ దీనికి పేరు పెడితే ఇపుడు పాలిటిక్స్ చీతాగా మారుతోంది. చూడాలి మరి దీని మీద బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.