Begin typing your search above and press return to search.
బాపట్లలో మారుతున్న రాజకీయాలు.. !
By: Tupaki Desk | 28 May 2022 10:30 AM GMTఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలు వచ్చే ఎన్నికలపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఇక్కడ నుంచి .. కోన రఘుపతిని ప్రజలు గెలిపించారు. కానీ, ఇప్పడు మార్పును కోరుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. ఎందుకంటే.. ఎంత సంక్షేమం అందించినా.. అభివృద్ధ లేక పోవడం.. కనీసం.. ఎమ్మెల్యే అయినా.. ప్రజల్లో ఉండకపోవడం.. వంటివి ఇక్కడ చర్చకు వస్తున్నాయి.
"వరుసగా రెండుసార్లు సార్ ను గెలిపించాం. ఆయన మంచి నాయకుడే. కానీ, మాకు ఏం చేస్తున్నారు? అనేది చూస్తే.. ఏమీ లేదు. కాబట్టి.. ప్రజల్లో మార్పు కనిపిస్తోంది!" అని ఒక విద్యార్ధి సంఘం నాయకుడు పేర్కొన్నారు. వాస్తవానికి వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడికక్కడ.. వారిని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న గడపగడప కార్యక్రమంలో నిలదీతల పర్వం కూడా పెరిగింది. కానీ, బాపట్లలో ఎక్కడా ప్రజల నుంచి నిలదీతలు కనిపించడం లేదు.
నిజానికి.. వ్యతిరేకత.. నిలదీతలు వచ్చిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. మంత్రులు హడలిపోతున్నారు. అయితే.. ఎలాంటి వ్యతిరేకత లేక పోవడం పైనా.. ఇక్కడి ఎమ్మెల్యే... డిప్యూటీ స్పీకర్ కోన కూడా తర్జన భర్జన పడుతున్నారు. "సైలెంట్‌గా ఏదో జరుగుతోంది.
అదే మాకు కూడా అర్ధం కావడం లేదు.. దీనిని వ్యతిరేకత అనుకోవాలో.. లేక.. ఏమనుకోవాలో.. తెలియడంలేదు"అని కోనకు అత్యంత సన్నిహిత నాయకుడుగా ఉన్న ఒకరువ్యాఖ్యానించారు.
నిజానికి రెండు ఎన్నికల్లో కోనకు ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. అయితే.. తొలి ఐదేళ్లు కూడా తాను ప్రతిప క్షంలో ఉన్నానని.. అందుకే ఏమీ చేయలేక పోయానని.. సో.. ఇప్పుడు అవకాశం ఇవ్వండి..అ ద్భుతాలు చేసి చూపిస్తానని.. 2019 ఎన్నికల్లో కోన పిలుపునిచ్చారు.
కానీ, ఇప్పటి వరకు ఏమీచేయలేక పోయారు. అదేమంటే.. నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని అంటున్నారు. ఇదే ఇప్పుడు ప్రజల్లో వైసీపీకి వ్యతిరేకత పెంచేలా చేసిందని అంటున్నారు. వ్యక్తిగా.. నాయకుడిగా.. కోనపై వ్యతిరేకత లేకపోయినా.. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేకపోవడమే.. చర్చకు దారితీస్తోంది.