Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'అఖిల భార‌త' రాజ‌కీయాలు!!

By:  Tupaki Desk   |   20 Dec 2022 1:30 AM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అఖిల భార‌త రాజ‌కీయాలు!!
X
నాయ‌కులు అంటే ఎవ‌రు.. ఖ‌ద్ద‌రు దుస్తులు ధ‌రించి, నెత్తిన టోపీ పెట్టుకున్న‌వారేనా? అది ఒక‌ప్పుడు.. ఇప్పుడు టిప్ టాప్‌గా.. ట‌క్ చేసుకుని, చ‌లువ క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి.. టై వేలాడుతున్న ఉన్నతాధికారులు కూడా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తామంటూ.. ముందుకు వ‌స్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయా లు మారుతున్నాయి. నాయ‌కులుకూడా మారుతున్నారు. వ‌చ్చే ఎన్ని క‌లను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వ పార్టీలు.. గెలుపు గుర్రం ఎక్కేవారిని అక్కున చేర్చుకునేందుకు త‌హ‌త‌హ‌లాడు తున్నాయి.

ఈ క్ర‌మంలో అనేక రూపాల్లో మార్పులు క‌నిపించ‌నున్నాయి. ఈ మార్పులు రాజ‌కీయ ప‌రంగానే కాదు.. వ్య‌క్తుల ప‌రంగా కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఐఏఎస్‌లుగా ఉంటూ.. జిల్లా క‌లెక్ట‌ర్లుగా, ఇత‌ర శాఖ‌ల‌కు స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా ఉన్న అఖిల భార‌త స‌ర్వీసు అధికారులు.. అదేవిధంగా లాఠీ ప‌ట్ట‌క‌పోయినా.. టోపీ పెట్టుకుని.. పోలీసు వ్య‌వ‌స్థ‌ను నియంత్రిస్తున్న ఉన్న‌తాధికారులు సైతం రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు.

ఒక‌ప్పుడు.. ఐఏఎస్‌లు.. ఐపీఎస్‌లు ఇలా వ‌చ్చిన వారు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌స్తుతం ఉన్న విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ఒక‌ప్పుడు ఫారిన్ స‌ర్వీస్ చేశారు. అయితే, ఆయ‌న రిటైర‌య్యాక‌.. ప్ర‌ధాని మోడీ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. లోక్‌స‌బ‌కు ఎన్నిక కాకుండానే ఆయ‌న రాజ్య‌స‌భ ద్వారా కేంద్ర మంత్రి అయ్యారు.కానీ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిటైర్మెంట్‌తో ప‌నిలేకుండా.. ముంద‌స్తుగానే వ‌లంటీర్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించి.. ఖ‌ద్ద‌రు తొడుక్కునేందుకు టక్కు బాబులు సిద్ధంగా ఉన్నారు.

ఇటు ఏపీలోను, అటు తెలంగాణ‌లోనూ దాదాపు 10 మంది వ‌ర‌కు ఇలా రాజ‌కీయ రంగంలోకి వ‌చ్చేందుకు, రెడీ అవుతున్నారు. వీరికి ప్ర‌భుత్వాధినేతల ఆశీస్సులు పుష్క‌లంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే, వీరు గెలుస్తారా? గెల‌వ‌రా? అనేది ప్ర‌జాభీష్టం. గ‌త ఎన్నిక‌ల్లో సీఐగా రిజైన్ చేసి హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన గోరంట్ల మాధ‌వ్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇదేస‌మయంలో ఐపీఎస్‌కు రిజైన్ చేసి విశాఖ నుంచి పోటీ చేసిన మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. సో.. ఇక్క‌డ పార్టీలు కూడా ముఖ్య‌మే. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.