Begin typing your search above and press return to search.

టిక్కెట్‌పై డౌట్ కొడుతోందా... అందుకేనా ఆ వైసీపీ ఎమ్మెల్యే రుస‌రుస‌...!

By:  Tupaki Desk   |   9 Aug 2022 4:09 AM GMT
టిక్కెట్‌పై డౌట్ కొడుతోందా... అందుకేనా ఆ వైసీపీ ఎమ్మెల్యే రుస‌రుస‌...!
X
ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట‌లో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టికెట్ పోరు అప్పుడే ప‌ద‌నిస లు పాడిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ లేద‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. దీనిని ఆయ‌న కూడా ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా.. మ‌రింత ఆక్రోశంతో ర‌గిలిపోతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న స‌హ‌నం కోల్పోయి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. దీంతో జ‌గ్గం పేట రాజ‌కీయాలు.. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచే ర‌గులుతున్నాయి.

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌తృవులు ఉండ‌ర‌న్న‌ట్టుగా.. వైసీపీలోనూ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోం ది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీని వ‌దిలి పెట్టి వ‌చ్చిన మాజీ ఎంపీ తోట న‌ర‌సింహం.. అనారోగ్య కార ణాలతో త‌న స‌తీమ‌ణిని రంగంలోకి దింపిన విష‌యం తెలిసిందే.

అప్ప‌ట్లోనే జ‌గ్గంపేట నియోజ‌క వ‌ర్గం టికెట్ ను కోరారు. అయితే.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇస్తాన‌ని.. జ‌గ‌న్ పాద‌యాత్ర లో హామీ ఇచ్చిన నేప‌థ్యంలో తోట వాణికి.. పెద్దాపురం టికెట్ ఇచ్చారు.

ఇక‌, జ‌గ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగిందో ఏమో.. తెలియ‌దు కానీ.. చంటిబాబుకు.. పార్టీకి మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే తోట మ‌ళ్లీ పార్టీఅధినేత‌కుద‌గ్గ‌ర‌య్యార‌ని.. గుస‌గుస వినిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో అయితే.. ఈ విష‌యాన్ని బాహాటంగానే చెప్పుకొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తోట న‌ర్సింహంకే జ‌గ‌న్ టికెట్ ఇస్తున్నార‌ని.. పెద్ద ఎత్తున గుస‌గుస వినిపిస్తోంది.

అంతేకాదు..చంటిబాబును ప‌క్క‌న పెడ‌తార‌ని కూడా అంటున్నారు. బ‌హుశ ఈ వార్త‌లు తెలిసిన త‌ర్వాతే.. ఏమో.. చంటిబాబు బ్లాస్ట్ అయిపోయారు. ఇటీవ‌ల కొత్త పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడు తూ.. ''వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎవ‌రు ఏ పార్టీలో ఉంటారో.. ఎవ‌రు మాత్రం చెప్ప‌గ‌ల‌రు. నా మ‌టుకు నాకు.. మాత్రం గ్యారెంటీ ఉందా.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీలూ మారొచ్చు. జెండాలు మారొచ్చు'' అని బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తో జ‌గ్గంపేట వైసీపీ రాజ‌కీయాలు మార‌బోతున్నాయా? టికెట్‌ను తోట‌కు క‌న్ఫ‌ర్మ్ చేసేశారా? అనే చ‌ర్చ రాష్ట్ర‌వ్యాప్తంగా కాపు సామాజిక వ‌ర్గంలో జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.