Begin typing your search above and press return to search.

త‌లైవాతో త‌ల‌ప‌డ‌క త‌ప్ప‌దేమో: క‌మ‌ల్

By:  Tupaki Desk   |   17 March 2018 12:37 PM GMT
త‌లైవాతో త‌ల‌ప‌డ‌క త‌ప్ప‌దేమో: క‌మ‌ల్
X
త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాసన్ ల రాజ‌కీయ అరంగేట్రం అనంత‌రం త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ త‌న పార్టీ పేరు, విధివిధానాలు ప్ర‌క‌టించాల్సి ఉండ‌గా...క‌మ‌ల్ ``మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్``పేరుతో సొంత‌పార్టీని లాంచ్ చేశారు. అయితే, సినిమాల‌ప‌రంగా ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య పోటీ ఉన్న‌ట్లే....రాజ‌కీయాల‌లోనూ పోటీ ఉంటుందా? లేదా? అన్న సందేహాల‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. క‌మ‌ల్ పార్టీతో క‌లయిక‌పై కాల‌మే స‌మాధాన‌మిస్తుంద‌ని ర‌జ‌నీ ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు. ఒక వేళ ర‌జ‌నీ పార్టీ రంగు కాషాయమైతే...తాను మ‌ద్ద‌తు తెల‌ప‌బోన‌ని క‌మ‌ల్ స్ప‌ష్టం చేశారు. తాజాగా, ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా క‌మ‌ల్ కు మ‌ళ్లీ అదే ప్ర‌శ్న ఎదురైంది. రాజ‌కీయాల‌లో తాను త‌లైవాతో విభేదించే అవ‌కాశ‌మే ఎక్కువగా ఉంద‌ని క‌మ‌ల్ స్ప‌ష్టం చేశారు.

ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచేందుకు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో ర‌జ‌నీ - తాను న‌టించామ‌ని క‌మ‌ల్ అన్నారు. అయితే, రాజ‌కీయాల‌కు వ‌చ్చేస‌రికి త‌మ ఆలోచ‌నా విధానాలు పూర్తి భిన్నంగా ఉంటాయ‌ని, చాలా అంశాల్లో త‌మ ఇద్దరి అభిప్రాయాలు క‌ల‌వ‌క‌పోవ‌చ్చ‌ని క‌మల్ చెప్పారు. సినిమాల్లో ర‌జ‌నీ న‌టించిన‌ పాత్ర‌లు త‌న‌కు సూట్ కావ‌ని, అదే విధంగా తాను పోషించిన పాత్ర‌ల్లో ర‌జ‌నీ సూట్ కార‌ని అన్నారు. రాజ‌కీయాల్లో కూడా త‌మ ఆలోచ‌న‌లు, విధివిధానాలు వేరని అన్నారు. ర‌జ‌నీకి అధ్యాత్మిక భావాలు ఎక్కువ‌ని, ఆయ‌న ఆస్తికుడ‌ని,..... తాను హేతువాదిన‌ని, నాస్తికుడిన‌ని క‌మ‌ల్ అన్నారు. అస‌లు దేవుడున్నాడ‌ని కూడా నేను న‌మ్మ‌న‌ని చెప్పారు. కానీ, ర‌జ‌నీకాంత్ తో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా మంచి అనుబంధం ఉంద‌ని, రాజ‌కీయాల్లో అభిప్రాయభేదాల కారణంగా త‌మ స్నేహానికి ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌ద‌ని క‌మ‌ల్ అన్నారు.