Begin typing your search above and press return to search.

పోలార్డ్ తుపాను ఇన్నింగ్స్.. ముంబై థ్రిల్లింగ్ విన్..!

By:  Tupaki Desk   |   2 May 2021 4:32 AM GMT
పోలార్డ్ తుపాను ఇన్నింగ్స్.. ముంబై థ్రిల్లింగ్ విన్..!
X
ఐపీఎల్ 2021లో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీలో సీఎస్ కే, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఐపీఎల్ లోనే ఇది అత్యధిక ఛేదనగా నిలిచింది. చెన్నై నిర్దేశించిన 219 పరుగుల ఛేదనలో ముంబై ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ముంబై బ్యాట్స్మెన్ కీరన్ పోలార్డ్ తుపాను ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఊచకోతకు బౌలర్లు అందరూ బలి అయ్యారు. పోలార్డ్ పోలార్డ్ 34 బంతుల్లోనే (6పోర్లు, 8 సిక్సర్లతో) 87 పరుగులు సాధించాడు. చెన్నై జట్టులో కూడా రాయుడు చాన్నాళ్ల తర్వాత తన విశ్వరూపం చూపాడు. డెత్ ఓవర్లలో వీరబాదుడు బాదాడు. రాయుడు సూపర్ ఇన్నింగ్స్ తో చెన్నై 218 పరుగులు సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంబటి రాయుడు కేవలం 27 బంతుల్లో (4ఫోర్లు,7సిక్సర్లు) 72 పరుగులు సాధించాడు. డుప్లెసిస్ 28 బంతుల్లో (2 ఫోర్లు, 4సిక్సర్లు)50 పరుగులు, మొయిన్ అలీ 36 బంతుల్లో (5 ఫోర్లు, 5సిక్సర్లతో ) 58 పరుగులు చేశాడు. ముంబై బౌలర్ పోలార్డ్ కు రెండు వికెట్లు దక్కాయి.

భారీ ఛేదనను ముంబై ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు డీకాక్ (38), రోహిత్ శర్మ (35) తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత సూర్య కుమార్(3) వెంటనే వెనుదిరిగినా కృనాల్ పాండ్యా (32), పోలార్డ్ చెలరేగిఆడారు. కృనాల్ ఔట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(16) 19 ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. అయితే హార్దిక్, నీషమ్( 0) వెంట వెంటనే అవుట్ కావడంతో ముంబై శిబిరంలో ఆందోళన నెలకొంది. చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా ముంబై మ్యాచ్ గెలిచిందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే పోలార్డ్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టి చివరి బంతికి ముంబైకి విజయాన్ని అందించాడు. తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించిన పోలార్డ్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.