Begin typing your search above and press return to search.
అమెరికాలో మొదలైన పోలింగ్ .... హాంప్ షైర్ లో తోలి ఓటు !
By: Tupaki Desk | 3 Nov 2020 1:50 PM GMTఅమెరికా అధ్యక్ష పదవికి ఈ రోజు కొనసాగుతున్న ఎన్నికలపై అమెరికా ప్రజల దష్టే కాకుండా యావత్ ప్రపంచం దష్టి కేంద్రీకతమైంది. అమెరికా అధ్యక్షుడంటే ఆ ఒక్క దేశానికే కాకుంగా ఈ భూగోళం అంతటికీ శక్తివంతుడన్న నమ్మకమే కారణం. ఇకపోతే తాజాగా అమెరికాలో అసలు ఘట్టం ప్రారంభమైంది. అగ్రరాజ్యంలో కొద్దిసేపటి కిందట పోలింగ్ ప్రారంభమైంది. మొదటి ఓటు హాంప్ షైర్ లో పోలైంది. ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలివస్తున్నారు. భారత కాలమాన ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ పోలింగ్ సాగుతోంది. అమెరికాలో మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో సగం ఓట్లు పోలైయ్యాయి. దాదాపు 10 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. హవాయ్, టెక్సాస్, మోంటానా రాష్ట్రాల్లో భారీగా ముందస్తు ఓట్లు పోలైయ్యాయి. ఈ పోస్టల్ ఓట్లపై రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి, అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి అంకం ప్రచార కార్యక్రమాలు ముగించుకుని వైట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడి నుంచే పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్ తన విజయంపై ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా భారతీయ అమెరికన్లు తనకే మద్దతిస్తారని బలంగా నమ్ముతున్నారు. ఉపాధ్యక్ష పదవి కోసం భారత సంతతి మహిళ కమలా హారిస్ ను ఎంపిక చేసుకోవడంతోనే తన విజయం సగం ఖాయమైందని బైడెన్ విశ్వసిస్తున్నారు. ఇక అమెరికన్ ఓటరు జాతీయవాదానికే మళ్లీ జై కొడతారా ట్రంప్ పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటారా అనేది వేచి చూడాలి. గత అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు దేశ ప్రజల ఓట్లలో 6,58,44,954 ఓట్లు (48.2 శాతం) రాగా, ట్రంప్‌కు 6,29,79,879 (46.1 శాతం) ఓట్లు వచ్చినప్పటికీ ట్రంప్ 306–232 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల తేడాతో విజయం సాధించారు.