Begin typing your search above and press return to search.
ఏపీలో ఎన్నింటి వరకూ పోలింగ్ జరిగిందో తెలుసా?
By: Tupaki Desk | 13 April 2019 3:36 AM GMTఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్.. సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. కొన్నిచోట్ల సమయాన్ని పెంచుతూ ఆరు గంటల వరకూ పొడిగిస్తుంటారు. గడువు ముగిసే సమయానికి క్యూలైన్లో ఎంతమంది ఉంటారో వారందరికి ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించటం మామూలే.
తరచూ మొరాయిస్తూ చిరాకు పెట్టిన ఈవీఎంలు ఏపీ ప్రజల సహనానికి పరీక్షగా మారాయి. అయినప్పటికీ.. ఓటు వేయాల్సిందే అన్నట్లుగా వ్యవహరించిన ఏపీ ఓటర్ల ఓపికకు ఎంతటి వాడైనా ఫిదా కావాల్సిందే. స్వేచ్ఛగా ఓటేయాలంటూ నినాదాలు చెబుతూ ప్రచార హడావుడి చేసిన ఎన్నికల సంఘం దారుణంగా ఫెయిల్ అయ్యింది. అదే పనిగా ఈవీఎంలు మొరాయిస్తుండటంతో గంటల కొద్దీ క్యూలైన్లలో నిలుచున్న ఓటర్లు.. చివరకు ఓట్లు వేసి కానీ ఇంటికి వెళ్లని పరిస్థితి.
ఏపీలో జరిగిన పోలింగ్ సందర్భంగా వేలాది ఈవీఎంలు మొరాయించటంతో అర్థరాత్రి వరకూ పోలింగ్ సాగిన వైనం తెలిసిందే. అయితే.. కొన్నిచోట్ల పక్కరోజు ఉదయం.. అంటే శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల వరకూ పోలింగ్ జరిగిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఇలాంటి పరిస్థితి మూడు పోలింగ్ కేంద్రాల్లో జరిగినా.. అంత ఓపిగ్గా.. అన్నేసి గంటలు క్యూలో నిలుచొని మరీ ఓటు వేయటం గొప్పగా చెప్పక తప్పదు.
సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లో ఉన్న వారు 11 గంటల పాటు వెయిట్ చేసి.. తెల్లవారుజామున 5 గంటల వరకూ ఓటు వేయటం అంటే మాటలు కాదు. మూడు చోట్ల తెల్లవారుజాము వరకూ పోలింగ్ సాగినా.. మరికొన్నిచోట్ల అర్థరాత్రి దాటితే.. ఈవీఎంలో డేట్ మారుతుందని చెబుతూ.. ప్యాకప్ చేసేసిన అధికారులు ఉన్నారు. వారి కారణంగా పలువురు ఓట్లు వేసే పరిస్థితి లేకపోవటం గమనార్హం.
అర్థరాత్రి.. తెల్లవారుజామున ఓటింగ్ జరుగుతుండటంతో క్యూలో ఉన్న ఓటర్లు పలువురు.. భోజనం చేసి వచ్చి మరీ ఓటేయటం విశేషం. ఓటు కోసం ఇంత కష్టపడిన ఓటరు గెలిస్తే.. సమర్థంగా ఎన్నికల్ని నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం మాత్రం ఏపీలో అట్టర్ ప్లాప్ అయ్యిందని చెప్పక తప్పదు. ఏపీలోని రెండు కేంద్రాల్లో అర్థరాత్రి అయ్యిందంటూ పోలింగ్ ను అర్థాంతరంగా పోలింగ్ నిలిపివేస్తే.. మరో మూడు ప్రాంతాల్లో మాత్రం తెల్లవారుజామున ఐదు గంటల వరకూ పోలింగ్ సాగింది. ఇంతకూ ఆ పోలింగ్ కేంద్రాలు ఏమిటన్నది చూస్తే..
% విశాఖ జిల్లా పొంగలిపాక పోలింగ్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి పోలింగ్ నిలిపివేశారు
% విశాఖపట్నం పాములవాకలోని పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి వేళలో.. పోలింగ్ ఆపేశారు
% విశాఖపట్నంలోని జే నాయుడిపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ ఓట్లేశారు
% కృష్ణా జిల్లా పడమటి మాధపవరం పోలింగ్ కేంద్రంలో తెల్లవారుజామున 5 గంటల వరకూ పోలింగ్ సాగింది
% కృష్ణా జిల్లా గణపవరం పోలింగ్ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకూ ఓట్లేశారు