Begin typing your search above and press return to search.
రూ.10లక్షల ఏకగ్రీవాన్ని రద్దు చేశారు!
By: Tupaki Desk | 5 May 2019 5:52 AM GMTస్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఒకస్థాయిలో నమోదవుతూనే ఉంటాయి. ఇలాంటి వాటి విషయంలో తెర వెనుక రాజకీయాలు భారీగా ఉంటాయి. అయితే.. దీనికి సంబంధించిన అంశాలు దాదాపుగా బయటకు రాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ముడుపుల ఎర వేసిన టీఆర్ ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఏకగ్రీవమని ఎన్నికల అధికారి ప్రకటించిన తర్వాత.. సదరు కాంగ్రెస్ అభ్యర్థి దొడ్ల వెంకట నారాయణ రెడ్డి తెర మీదకు వచ్చి.. తనకు రూ.10లక్షలు ముట్టచెప్పి.. బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నట్లుగా ఆరోపించారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ అంశంపై త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ విచారణలో కాంగ్రెస్ అభ్యర్థిని లోబర్చుకున్న టీఆర్ ఎస్ అభ్యర్థి వైనాన్ని కమిటీ గుర్తించింది.
దీంతో.. ఎన్నికను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించటంతో పాటు.. అభ్యర్థిని ప్రలోభ పెట్టిన టీఆర్ ఎస్ అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. తర్వలోనే ప్రత్యేకంగాఎన్నికను నిర్వహిస్తున్న ఈ స్థానానికి మరోసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిసైడ్ చేశారు. మొత్తానికి ప్రలోభ పెట్టే ప్రయత్నాన్ని కొత్త తరహాలో రచ్చ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి.. ఈసారి ఏం చేస్తారో చూడాలి.