Begin typing your search above and press return to search.

ఇంతకూ ఈ హాట్‌ లేడీ ఎవరో తెలుసా.?

By:  Tupaki Desk   |   13 May 2019 9:28 AM GMT
ఇంతకూ ఈ హాట్‌ లేడీ ఎవరో తెలుసా.?
X
వారం రోజుల నుంచి ఒక అందమైన ఆంటీ సోషల్‌ మీడియాను ఊపేస్తుంది. అసలు ఈమే కనుక మన పోలింగ్ స్టేషన్‌ లో ఉంటే నా సామిరంగా.. ఈవీఎమ్‌ బద్దలైపోయేదని.. 100కి 100 శాతం పోలింగ్‌ నమోదు అయ్యేదని కామెంట్లు వస్తున్నాయి. స్లీవ్‌ లెస్‌ జాకెట్‌, కూల్‌ గాగుల్స్‌, లేత పసుపురంగు చీర.. ఒక చేతిలో ఫోన్‌, మరో చేతిలో పోలింగ్‌ బాక్స్‌. దేశంలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఆ దేవుడే దివి నుంచి భువికి పంపాడా అన్నట్లుగా ఉన్న ఆ పోలింగ్‌ ఆఫీసర్‌ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇంతకూ ఈ ఆంటీ ఎవరో తెలుసా.

చూడగానే గుండెకు కరెంట్‌ షాక్‌ కొట్టినట్లుగా అన్పించే ఈ ఆంటీ పేరు రీనా ద్వివేది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో గవర్నమెంట్‌ ఎంప్లాయి. పబ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్‌-పీడ‌బ్ల్యూడీలో ప‌నిచేస్తోంది. ఎన్నిక‌ల విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా లక్నోకు సుమారు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న న‌గ్రామ్ పోలింగ్ బూత్‌లో ఆమె ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన పూర్త‌యిన అయిదో విడ‌త ఎన్నిక‌ల విధుల‌కు ఆమె హాజ‌ర‌య్యారు. పోలింగ్‌ కు ముందురోజు ఈవీఎంల‌ను తీసుకెళ్తున్న స‌మ‌యంలో తుషార్ అనే ఓ ప్రెస్ ఫొటోగ్రాఫ‌ర్ రీనా ద్వివేదీని ఫొటో తీశారు. నెట్టింట్లో పోస్ట్ చేశారు. అంతే! ఒక్క‌సారిగా ఆ పిక్ కాస్తా వైర‌ల్‌ గా మారిపోయింది. రీనాను ఓవ‌ర్ నైట్‌ ను స్టార్ చేసింది.

అందం ఉండడం వేరు.. ఆ అందాన్ని ఇంకా అందంగా కన్పించేలా తయారయ్యడం వేరు. ఈ రెంటిలోనూ ద్వివేదికి నూటికి నూరు మార్కులు పడ్డాయి. నెటిజన్లు పుణ్యామా అంటూ ఇప్పుడు ద్వివేది ఇండియా మొత్తం స్టార్‌ అయిపోయింది. ఇలాంటి అధికారి ఉంటే మేం అసలు జైలు నుంచి ఎందుకు బయటకు వెళ్తాం అంటూ ఖైదీలు మొరపెట్టుకుంటున్నట్లుగా కార్టూన్లు కూడా వచ్చేశాయి. దీంతో… ఇప్పుడు రీనాని సినిమాల్లోకి, సీరియల్స్‌ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు తాను సోషల్‌ మీడియాలో స్టార్‌ అయిన దగ్గరనుంచి సెల్ఫీల కోసం డిమాండ్‌ ఎక్కువైందని చిలిపిగా నవ్వుతోంది ఈ రీనా ఆంటీ.