Begin typing your search above and press return to search.

లెక్కతేలింది.. ఏపీ పోలింగ్ 79.64శాతం

By:  Tupaki Desk   |   13 April 2019 5:06 AM GMT
లెక్కతేలింది.. ఏపీ పోలింగ్ 79.64శాతం
X
ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ప్రహసనంగా సాగిన ఏపీ ఎన్నికల పోలింగ్ లో ఎట్టకేలకు లెక్క తేలింది. ఏపీ వ్యాప్తంగా 79.64శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ 80శాతం దాటుతుందని భావించినా.. గతం కంటే 1.23శాతం అధికంగా పోలింగ్ నమోదు కావడం విశేషం.

ఇక ఏపీలోని జిల్లాలను బట్టి చూస్తే అత్యధికంగా ప్రకాశం జిల్లాలో అత్యధిక పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా విశాఖ జిల్లాలో పోలింగ్ జరిగింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా చూస్తే అద్దంకి నియోజకవర్గంలో ఏపీలోనే అత్యధికంగా 89.82శాతం పోలింగ్ నమోదైంది.

ఏపీలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భారీ క్యూలు చూసి అంతా 85శాతం పైనే నమోదవుతుందని అంచనావేశారు. కానీ మొత్తం పోలింగ్ 79.64శాతానికే పరిమితం కావడం గమనార్హం.

ఏపీలో పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఏపీలో మొత్తం 3 కోట్ల 13లక్షల 33వేల 631 ఓట్లు పోలయ్యాయి. వీరిలో పురుషులు 15545211 మంది.. స్త్రీలు 15787759 మంది మహిళలు ఓటేశారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటేయడం విశేషం.

2014లో 78.41శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 2019లో పోలింగ్ శాతం మరింత పెరిగింది. గత ఎన్నికల్లో 3.67 కోట్ల మంది ఓటర్లకు గాను 2.87 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈసారి 2019 ఎన్నికల్లో 3.93 కోట్ల మంది ఓటర్లకు గాను 3.13 కోట్ల మంది ఓటేశారు. గత ఎన్నికల కంటే ఈసారి 26 లక్షల మంది అధికంగా ఓటేయడం విశేషం.

*ఏపీలో అత్యధిక పోలింగ్ ప్రకాశం జిల్లాలో: 85.98 శాతం..

* అత్యల్ప పోలింగ్ విశాఖపట్నం జిల్లాలో : 71.81శాతం

* అత్యధిక పోలింగ్ నమోదైన నియోజకవర్గం అద్దంకి: 89.92శాతం, ఆ తర్వాత జగ్గయ్యపేట 89.64శాతం, దర్శి 89.62శాతం తర్వాత స్తానాల్లో నిలిచాయి.

*ఇక రెండు స్థానాల్లో రీపోలింగ్ కు ఈసీ నిర్ణయించింది. గుంటూరు జిల్లాలోనే రీపోలింగ్ కు సిఫారసు చేసింది.

+జిల్లాల వారీగా పోలింగ్ శాతం

* చిత్తూరు-81.03 శాతం
* అనంతపురం -81.90 శాతం
*కర్నూలు -77.68 శాతం
*కడప -77.21 శాతం
*నెల్లూరు -76.68 శాతం
*ప్రకాశం -85.93 శాతం
* గుంటూరు -82.37 శాతం
* కృష్ణా -81.12 శాతం
*పశ్చిమ గోదావరి -82.19 శాతం
*తూర్పు గోదావరి -80.08 శాతం
* విశాఖపట్నం -71.81 శాతం
* విజయనగరం -80.68 శాతం
*శ్రీకాకుళం -75.14 శాతం

అన్ని జిల్లాల కంటే విశాఖలో ఓటింగ్ శాతం తగ్గడం విశేషం.. అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్లే ఇక్కడ ఆసక్తి చూపలేదు. ఫలితాలు 40 రోజుల్లో వెలువడనున్నాయి.