Begin typing your search above and press return to search.

రీపోలింగ్ జ‌రిగిన 5 చోట్ల పోలింగ్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   7 May 2019 5:27 AM GMT
రీపోలింగ్ జ‌రిగిన 5 చోట్ల పోలింగ్ ఎంతంటే?
X
ఏపీలో మూడు జిల్లాల ప‌రిధిలో జ‌రిగిన ఐదు పోలింగ్ స్టేష‌న్ల‌లో రీపోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. మ‌రి.. ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఎంత శాతం ఓట్లు పోల్ అయ్యాయి? అన్న‌దిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏప్రిల్ 11న జ‌రిగిన పోలింగ్ లో పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించ‌గా..రీపోలింగ్ జ‌రిగిన ఎక్క‌డా ఈవీఎంలు మొరాయించిన దాఖ‌లాలు లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

రీపోలింగ్ జ‌రిగిన ఐదు చోట్ల క‌లిపి స‌గ‌టు చూస్తే.. 81.48 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 5064 ఓటర్ల‌కు 4126 మంది ఓట‌ర్లు ఓట్లు వేసిన‌ట్లుగా లెక్క తేలింది. గుంటూరు.. నెల్లూరు జిల్లాల్లో రెండేసి.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం కేసానుప‌ల్లిలో 956 మంది ఓట‌ర్ల‌కు.. అసెంబ్లీ.. పార్ల‌మెంటు రెండింటికి క‌లుపుకొని 89.23 శాతం (853) ఓట్లు పోల్ అయ్యాయి. ఇక‌.. గుంటూరు ప‌శ్చిమ స్థానం ప‌రిధిలోని న‌ల్ల‌చెరువులో 1396 మంది ఓట‌ర్ల‌కు 75.43శాతం ఓట్లు (1053 ఓట్లు) పోల్ అయ్యాయి.

ప్ర‌కాశం జిల్లా ప‌రిధిలోని య‌ర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలోని 247 పోలింగ్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న క‌ల‌నూత‌ల‌లో రీపోలింగ్ నిర్వ‌హించారు. ఇక్క‌డ మొత్తం 1070 మంది ఓట‌ర్లు ఉండ‌గా 87.01 శాతం ఓట్లు (931) పోల్ అయ్యాయి. నెల్లూరు జిల్లా కోవ‌రు నియోజ‌క‌వ‌ర్గంలోని ఇసుక‌పాలెంలో పోలింగ్ జ‌రిగింది. ఇక్క‌డ 1084 మంది ఓట‌ర్ల‌కు 75.55 శాతం ఓట్లు (931 ఓట్లు) పోల్ అయ్యాయి. ఇదే జిల్లా ప‌రిధిలోని సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గం అట‌కానితిప్ప పోలింగ్ స్టేష‌న్లో మొత్తం 558 మంది ఓట‌ర్ల‌కు 84.23 శాతం మంది ఓట్లు (470 ఓట్లు) పోల్ అయ్యాయి.

ఆస్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఏప్రిల్ 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో పురుషుల కంటే మ‌హిళ‌లే అత్య‌ధికంగా ఓట్లు వేశారు. తాజా రీపోలింగ్ లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఐదు పోలింగ్ కేంద్రాల్లో క‌లిపి 2136 మంది మ‌హిళ‌లు ఓట్లు వేయ‌గా.. 1990 మంది పురుష ఓట‌ర్లు ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు.