Begin typing your search above and press return to search.

రెండు శివసేనలు ... ఇద్దరు బాలా సాహెబ్ లు..

By:  Tupaki Desk   |   11 Oct 2022 4:15 AM GMT
రెండు శివసేనలు ... ఇద్దరు బాలా సాహెబ్ లు..
X
ఉన్న పార్టీ రెండుగా చీలింది. చెరొక దిక్కునా నాయకులు చేరిపోయారు. ఒకరు బీజేపీతో జతకట్టి అధికారం అనుభవిస్తూంటే మరొకరు తండ్రి పెట్టిన పార్టీ పేరును, గుర్తును పొందలేక ప్రత్యర్ధి చేతిలో చిత్తు అయిపోయారు. ఎన్నికల సంఘం శివసేన పార్టీని గుర్తుని రెండు వర్గాలకు ఇవ్వమని చెప్పడంతో ఇపుడు రెండు వర్గాలూ మళ్ళీ కొత్తగా పార్టీలకు పేర్లు గుర్తులతో రాజకీయ‌ కధను మొదలెడుతున్నారు.

అలా రెండు పార్టీల వారూ కూడా కొత్తగా నామకరణాలు చేసుకున్న పార్టీల కధా విధానం ఎలా ఉంది అంటే ముందుగా మాజీ సీఎం బాల్ థాక్రే కుమారుడు అయిన ఉద్ధవ్ థాక్రే తన పార్టీ పేరును శివసేన ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాక్రేగా మార్చుకున్నారు. ఆయనకు కాగడా గుర్తుని ఎన్నికల సంఘం కేటాయించింది.

మరో వైపు సీఎం గా ఉన్న ఏక్ నాధ్ షిండే తన పార్టీకి బాలసాహెబ్ ఆంచీ శివసేనగా పెట్టుకున్నారు. ఈ పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం గుర్తుని ఇవ్వలేదు. చిత్రమేంటి అంటే ఇద్దరూ పోరాడింది విల్లు గుర్తు కోసం అది బాల్ థాక్రే శివసేనకు ఎంచుకున్నది. ఆ గుర్తు ఈసీ ఫ్రీజ్ చేసింది. కొత్తగా గుర్తులను ఇస్తోంది.

అలాగే శివసేన పేరుని కూడా మార్చుకోమంది. అయితే కొత్తగా పార్టీ పెట్టుకున్న ఈ రెండు వర్గాలూ శివసేనను వదలలేదు. అలాగే బాల సాహెబ్ పేరునూ వదలలేదు. అంటే దాదాపుగా ఒకే రకంగా పార్టీల పేర్లు ఉన్నాయి. ఎందుకంటే శివసేన నామ‌స్మరణం బాల సాహెబ్ జపం లేకపోతే సొంత కొడుకూ జనంలోకి వెళ్లలేరు. ఏక్ నాధ్ షిండే లాంటి రాజకీయ బలాఢ్యుడూ ఓట్లు సాధించలేరు.

అంటే ఒక విధంగా బాలసాహెబ్ పేరుతోనే వీరు రాజకీయం చేయాలి. చేస్తారు అన్న మాట. అయితే ఈ రెండు పార్టీలలో ఏ పార్టీని జనాలు ఆదరిస్తే వారికే విల్లు గుర్తు దక్కుతుంది. వారిదే అసలైన శివసేన అవుతుంది.

ఈసీ మొత్తానికి భలే పోటీ పెట్టింది. మరి ఈ పోరులో నెగ్గేదెవరు, తగ్గేదెవరు అంటే మహా రాజకీయ తెర మీద కొద్ది కాలం ఆగితే రిజల్ట్ తెలిసిపోతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.