Begin typing your search above and press return to search.
ఢిల్లీలో కాలుష్యం.. పాక్.. చైనాల కుట్ర?
By: Tupaki Desk | 6 Nov 2019 4:05 AM GMTనోటికి వచ్చినట్లుగా మాట్లాడే విషయంలో బీజేపీ నేతలు ముందుంటారన్న విషయం తెలిసిందే. బోడి గుండుకు మోకాలికి లింకు పెట్టే తీరులో మాట్లాడే నేతలకు తగ్గట్లే తాజాగా బీజపీ నేత వినీత్ అగర్వాల్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఇటీవల ఢిల్లీ సరిహద్దులైన యూపీ.. హర్యానాకు చెందిన రైతులు తమ పంట పొలాల్ని కాల్చే క్రమంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగి పోయినట్లుగా వార్తలు రావటం తెలిసిందే.
దీనికి తోడు దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చటంతో కూడా కాలుష్య తీవ్రత మరింత పెరిగినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఇలాంటివేళ.. బీజేపీ నేత వినీత్ మాత్రం ఊహించనిరీతిలో వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని భయపెట్టేందుకు పాక్.. చైనాలు కలిసి విష వాయువులు విడిచి పెడుతున్నట్లుగా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
మోడీ.. అమిత్ షాలు విజయం సాధించిన తర్వాత నిరాశలోకి వెళ్లిన పాక్ ఇలా విషవాయువుల్ని వదిలేస్తున్నట్లు వినీత్ విమర్శలు చేశారు. హర్యానా.. పంజాబ్ రైతులు పంట పొలాల్లో వ్యర్థాల్ని కాల్చటం కారణంగా వాయు కాలుష్యం పెరుగుతుందన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. దేశంలోని సమస్యల్ని పరిష్కరించే సత్తా మోడీషాలకు ఉందని చెప్పే సదరు కమలనాథుడి మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఇరుగుపొరుగు దేశాల మీద ఇష్టం వచ్చినట్లుగా మాట అనేసే బదులు.. కాస్త ఆధారాలు చూపించి చేస్తే బాగుంటుందేమో? ఇలాంటి వారి వ్యాఖ్యలు అధికారపక్షానికి కొత్త తలనొప్పులు తెస్తాయన్న విషయాన్ని మోడీషాలు గుర్తిస్తే మంచిది.