Begin typing your search above and press return to search.

మహిళను కావాలనుకొని ఎస్సై దొరికిపోయాడు

By:  Tupaki Desk   |   25 Aug 2020 1:30 AM GMT
మహిళను కావాలనుకొని ఎస్సై దొరికిపోయాడు
X
ప్రజలను కాపాడాల్సిన రక్షక భటుడే భక్షించేలా తయారయ్యాడు. బాధ్యతాయుతమైన ఎస్సై వృత్తిలో ఉండి నీచానికి దిగజారాడు. ఓ మహిళను అన్యాయంగా కేసులో ఇరికించి కోరిక తీరిస్తేనే కేసు ఎత్తేస్తానని.. లేకుంటే బుక్ చేస్తానని బెదిరించాడు. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. మీడియాలో పతాక శీర్షిక అయ్యింది.

కుటుంబ పోషణ కోసం ఓ మహిళ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక జంక్షన్లో కిరాణా దుకానం నడుపుకుంటోంది. ఆ షాపులో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటూ పొందూరు ఎస్ఐ రామకృష్ణ సదురు మహిళా దుకాణంపై దాడి చేశాడు. షాపులో 11 మద్యం సీసాలు దొరికాయి. తాను ఇంటిలోని ఓ ఫంక్షన్ నిమిత్తం కొనుగోలు చేశానని చెప్పినా వినిపించుకోలేదు. వాటిని స్వాధీనం చేసుకొని మహిళను రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచాడు.

నువ్వంటే నాకిష్టమని.. నా ఇంటికొచ్చి సుఖపెడితే కేసు లేకుండా చేస్తానని బెదిరించాడు. పిల్లలు, భర్త ఉన్నారని.. ఆత్మాభిమానం చంపుకోనని ఆ మహిళ వాపోయింది. అయినా వినకపోవడంతో ఎస్ఐ మాటలను రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేసింది. దీంతో ఈ ఎస్ఐ బాగోతం బయటపడింది. ఇప్పుడు ఈ ఉదంతం మీడియాలో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎస్ఐ ఆడియోలు చర్చనీయాంశమయ్యాయి.