Begin typing your search above and press return to search.
పొంగులేటి పార్టీ మారుతున్నారా..? క్లారిటీ..!
By: Tupaki Desk | 9 Jan 2023 6:05 AM GMTతెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి సంతరించుకుంది. ఈ సంక్రాంతి తరువాత ఆ వేడి మరింత తీవ్రమయ్యేట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ..అధికార బీఆర్ఎస్ నాయకులపై వల వేస్తోంది. ఇప్పటికే చాలా మంది గులాబీ తోట నుంచి కమలం వైపు మళ్లారు. మరి కొందరు బీజేపీ పిలుపుకోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారన్న సంకేతాలు వినిపిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా త్వరలో కురుక్షేత్రం యుద్ధం చేస్తాననడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు జనవరి 1న ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో తుమ్మల నాగేశ్వర్ రావు వర్గం పాల్గొనలేదు. వేర్వేరుగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడంతో ఇక్కడి పార్టీలో వర్గ విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనను నమ్ముకున్న వాళ్లకు టికెట్లు ఇచ్చే బాధ్యత నాదే అని అన్నారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీ తగ్గించింది. ఆయన బీజేపీలోకి చేరుతారనే సమాచారంతోనే ఇలాంటి కామెంట్స్ బీఆర్ఎస్ ఈ చర్యలు తీసుకుంది. తనకు సెక్యూరిటీ తగ్గించిన నేపథ్యంలో పొంగులేటి మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను త్వరలో కురుక్షేత్ర యుద్ధం చేస్తానని అన్నారు. రాజకీయ నాయకులకు ప్రజల దీవెనలు ఉండాలని అప్పుడే వారు రాణించగలుగుతారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను తనను ఎప్పుడూ కోరుకుంటున్నారని అన్నారు.
ఇదిలా ఉండగా అటు బీజేపీ నాయకులు సైతం సంక్రాంతి తరువాత బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీలో చేరుతారని సంకేతాలు ఇవ్వడంతో పొంగులేటి చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ లోని కీలక నాయకులతో సంప్రదింపులు చేశామని చెబుతున్న కమలనాథులు త్వరలో కీలక నాయకులను చేర్చుకుంటామని అన్నారు. ఇందులో భాగంగా పొంగులేటితో ఆ ప్రయాణం మొదలవుతుందని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ ముందుగా బీఆర్ఎస్ నాయకులపై వల వేయడంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.